HBD: కృష్ణకు మాత్రమే సాధ్యమైన రికార్డులు ఇవే..!!

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే.. సూపర్ స్టార్ కృష్ణ కెరియర్ లో కృష్ణకు మాత్రమే సాధ్యమైన కొన్ని రికార్డులు కూడా ఉన్నాయి భవిష్యత్తులో మరే హీరో కూడా ఆ రికార్డులను చెరిపేయడానికి సాధ్యం కాదని చెప్పవచ్చు. ఈరోజు కృష్ణ జయంతి సందర్భంగా ఆ రికార్డులను ఒకసారి మనం తెలుసుకుందాం.

ఫోటో వివరణ అందుబాటులో లేదు.
1). సూపర్ స్టార్ కృష్ణ కెరియర్లో త్రిబుల్ రోల్ పాత్రలలో ఎక్కువ సినిమాలలో నటించిన హీరోగా రికార్డు ఎక్కారు కృష్ణ.. మొదటిసారి కుమార రాజా అనే చిత్రంతో త్రిపాత్రాభినయం లో నటించారు. ఆ తర్వాత డాక్టర్ సినీ యాక్టర్ అనే చిత్రంలో కూడా నటించారు. మరొక సినిమా పగబట్టిన సింహం, సింహపురి మొనగాడు, బంగారు కాపురం ,రక్తసంబంధం, బొబ్బిలి దొర వంటి చిత్రాలలో నటించారు.

2). తేనెమనసులు ఫస్ట్ ఈస్ట్ మాన్ కలర్ సోషల్ చిత్రంగా, తొలి జేమ్స్ బాండ్ చిత్రం గూడచారి 116 గా, తొలిసారి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు తొలి తెలుగు సినిమా స్కోప్ అల్లూరి సీతారామరాజు.. మొదటిసారి 70 MM సినిమా తదితర టెక్నాలజీని సైతం పరిచయం చేశారు కృష్ణ.

3). మొదటిసారి తెలుగు పాటకు జాతీయ అవార్డు అందుకున్న చిత్రం అల్లూరి సీతారామరాజు లోని తెలుగువీర లేవరా అనే పాట అందుకున్నది.

4). మొదటిసారి అవుట్డోర్ షూటింగ్ సినిమా తొలి స్కోప్ టెక్నిక్ విజయం సినిమా సాక్షి ఈ సినిమాని డైరెక్టర్ బాపు దర్శకత్వంలో తెరకెక్కించారు.

5). ఒకే ఏడాది అత్యధిక సినిమాలు చేసిన ఘనత కూడా కృష్ణకే కలిగింది ఏకంగా 18 సినిమాలలో నటించారు.