కడపలో టీడీపీ సీట్లు ఫిక్స్..అవే డౌట్.!

జగన్ సొంత జిల్లా వైసీపీ కంచుకోట..కడప జిల్లాలో సత్తా చాటాలని ఈ సారి టి‌డి‌పి గట్టిగానే ప్రయత్నిస్తుంది. గత కొన్ని ఎన్నికల నుంచి కడపలో టి‌డి‌పి దారుణంగా ఓడిపోతుంది. గత ఎన్నికల్లో జిల్లాలో 10 సీట్లు ఉంటే టి‌డి‌పికి ఒక్క సీటు కూడా రాలేదు. 10 సీట్లు వైసీపీనే గెలుచుకుంది. అయితే ఈ సారి కనీసం మూడు, నాలుగు సీట్లు గెలుచుకుని కడపలో ఉనికి చాటుకోవాలని చూస్తుంది. జిల్లాలో రెండు సీట్లు గెలిచిన చాలు వైసీపీకి చెక్ పెట్టినట్లే ఆ దిశగానే టి‌డి‌పి వెళుతుంది.

ఇదే క్రమంలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే ఇప్పటినుంచే జిల్లాలో టి‌డి‌పి అభ్యర్ధులని ఖరారు చేసుకునే పని లో ఉంది. ఇప్పటికే జిల్లాలో పలు సీట్లు ఫిక్స్ అయినట్లే కనిపిస్తున్నాయి. జగన్ కోట పులివెందులలో టి‌డి‌పి నుంచి బీటెక్ రవి పోటీ చేయనున్నారు. అక్కడ గెలవడం కష్టం గాని..జగన్ మెజారిటీ తగ్గిస్తే చాలు. ఇక మైదుకూరులో టి‌డి‌పికి గెలుపు అవకాశాలు ఉన్నాయి. కానీ అక్కడ పుట్టా సుధాకర్ యాదవ్ పోటీకి రెడీగానే ఉన్నారు…అదే సమయంలో డీఎల్ రవీంద్రా రెడ్డి సైతం లైన్ లో ఉన్నారు.

కమలాపురంలో పుత్తా నరసింహారెడ్డి ఉన్నారు..అదే సమయంలో వీరశివారెడ్డి ఈ సీటు కోసం పోటీ పడుతున్నారు. ప్రొద్దుటూరులో ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉండగా, ఆయనకు పోటీగా లింగారెడ్డి ఉన్నారు. కడపలో అమీర్ ఉన్నారు. జమ్మలమడుగులో భూపేష్ రెడ్డి పోటీ చేసే ఛాన్స్ ఉంది. రైల్వే కోడూరులో నరసింహ ప్రసాద్, రాయచోటిలో రమేష్ రెడ్డి, రాజంపేటలో చెంగల్రాయుడు ఉన్నారు. బద్వేలు సీటులో క్లారిటీ లేదు.

దాదాపు కడపలో టి‌డి‌పి నేతలు రెడీగానే ఉన్నారు. ఇంకా చంద్రబాబు ఖచ్చితంగా అభ్యర్ధులని ఫిక్స్ చేయాల్సి ఉంది.

Share post:

Latest