`రావ‌ణాసుర‌` ప్రీ రిలీజ్‌ బిజినెస్‌.. ర‌వితేజ హ్యాట్రిక్ కొట్టాలంటే ఎంత రాబ‌ట్టాలి?

రావ‌ణాసుర‌.. మాస్ మ‌హారాజా ర‌వితేజ నుంచి రాబోతున్న క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఇది. సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌టీ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్ల పై అభిషేక్‌ నామా, శ్రీకాంత్ విస్సా నిర్మించారు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా న‌టించారు.

ఈ చిత్రంలో ర‌వితేజ క్రిమిన‌ల్ లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన పోస్ట‌ర్స్, టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి. రేపు విడుద‌ల కాబోయే ఈ చిత్రం ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుంది అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇక‌పోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రావ‌ణాసుర రీజనబుల్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. నైజాంలో రూ.7 కోట్లు, సీడెడ్‌లో రూ.3 కోట్లు, ఆంధ్రాలో రూ.10 కోట్లు థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్లు బిజినెస్ జ‌రిగింది. ఇక ఓవ‌ర్ సీస్‌లో రూ.2.20 కోట్ల‌కు హ‌క్కులు అమ్ముడ‌య్యాయి. వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్‌గా రావ‌ణాసుర చిత్రం రూ.22.20 కోట్లు బిజినెస్ జ‌రుపుకుంది. ధ‌మాకా, వాల్తేరు వీర‌య్య చిత్రాల‌తో డ‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ ఖాతాలో వేసుకున్న ర‌వితేజ‌.. రావ‌ణాసుర‌తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలంటే రూ. 23 కోట్ల రేంజ్ లో షేర్ ని రాబ‌ట్టాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.