ఈ ఏడాది టాలీవుడ్ కు పరిచయం అయిన కొత్త భామల్లో అషికా రంగనాథ్ ఒకటి. నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన `అమిగోస్` మూవీతో అషికా తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
ఫిబ్రవరిలో భారీ అంచనాల నడుమ విడుదలైన అమిగోస్ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ, అషికా రంగనాథ్ మాత్రం ఆకట్టుకుంది. అందం, అభినయంతో మంచి మార్పులు వేయించుకుంది.
నటనతో కూడా మెప్పించింది. అయితే అషికాకు అమిగోస్ మొదటి చిత్రం కాదు. ఇంతకు ముందే ఈ బ్యూటీ కన్నడలో నటించింది. తక్కువ సమయంలో అక్కడ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
ప్రస్తుతం కన్నడ చిత్రాలతో బిజీగా గడుపుతున్న అషికా.. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. తరచూ అదిరిపోయే ఫోటో షూట్లతో కుర్రకారును అల్లాడిస్తుంటుంది. తాజాగా స్కై బ్లూ కలర్ డ్రెస్ గా క్లీవేజ్ షో చేసింది.
అషికా తాజా ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇవి చూసి నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. అషికా ఇంత అందంగా ఉందేంట్రా బాబు.. స్టార్ హీరోయిన్లు కూడా ఈమె ముందు వేస్టే అంటూ కామెంట్లు చేస్తున్నారు.