కోటంరెడ్డి-ఆనం ఎఫెక్ట్..నెల్లూరులో వైసీపీకి భారీ డ్యామేజ్!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి లాంటి వారు దూరం కావడం వల్ల..భారీ డ్యామేజ్ జరుగుతుందా? కంచుకోటల్లో వైసీపీకి చావుదెబ్బ తప్పదా? ప్రస్తుతం రాజకీయాలని చూస్తే అదే నిజమనిస్తుంది. మామూలుగా నెల్లూరు అంటే వైసీపీ కంచుకోట. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీదే లీడ్. 10 సీట్లు ఉన్న జిల్లాలో 2014లో వైసీపీ 7, టి‌డి‌పి 3 సీట్లు గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది.

అయితే అధికారంలోకి వచ్చాక సరిగ్గా పనిచేయకపోవడం, పథకాలు ఇచ్చిన ప్రజలపై పన్నుల భారం పెంచడం..కొందరు వైసీపీ నేతల అక్రమాలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో జిల్లాలో వైసీపీకి నష్టం జరిగింది. ఇదే క్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం వైసీపీకి దూరమయ్యారు. వారు దూరం కావడం కూడా వైసీపీకి నష్టం చేకుర్చింది. తాజాగా ఆత్మసాక్షి సంస్థ విడుదల చేసిన సర్వేలో నెల్లూరులో వైసీపీకి భారీ నష్టం తప్పదని తేలింది.

జిల్లాలో 10 స్థానాలు ఉంటే టి‌డి‌పి 5, వైసీపీ 2 సీట్లు గెలుచుకుంటుందని, 3 చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని తేలింది. టి‌డి‌పి గెలిచే సీట్లు వచ్చి..నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, వెంకటగిరి, కావలి, ఉదయగిరి..వైసీపీ గెలిచేవి సర్వేపల్లి, ఆత్మకూరు. ఇక టఫ్ ఫైట్ ఉన్నవి..కోవూరు, గూడూరు, సూళ్ళూరుపేట. ఇలా నెల్లూరులో టి‌డి‌పికి ఆధిక్యం వస్తుందని, వైసీపీ గ్రాఫ్ దారుణంగా పడిపోతుందని ఆత్మసాక్షి సర్వే తేల్చి చెప్పింది. దీని బట్టి చూసుకుంటే కోటంరెడ్డి, ఆనంలు వైసీపీకి దూరం అవ్వడం పెద్ద డ్యామేజ్ చేశాయని చెప్పవచ్చు.