ఈ టాలీవుడ్ నటీమణుల బంధుత్వాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారి పర్సనల్ లైఫ్ గురించి గురించి బయట ప్రపంచానికి చాలా తక్కువ మాత్రమే తెలిసి ఉంటుంది. ముఖ్యంగా వారి ఫ్యామిలీ లైఫ్ అలాగే బంధువుల గురించి ఎవరికీ తెలిసి ఉండదు. నిజానికి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న చాలామందికి బంధువులు ఉన్నారు వారు కూడా సినిమాల్లో కొనసాగుతూ తమకంటూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు ముఖ్యంగా నటీమణుల బంధువులు ఎందరో ఉన్నారు. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. సావిత్రి-రేఖ

మహానటి సావిత్రి గురించి చెప్పాల్సిన పని లేదు మాయాబజార్ సినిమాలోనే ప్రతి సినిమాలో అద్భుతంగా నటించి అందరి హృదయాలను దోచేసిందీ ముద్దుగుమ్మ. అయితే బాలీవుడ్ నటి రేఖ సావిత్రికి స్టెప్ డాటర్ అవుతుంది. అంటే సావిత్రిని పెళ్లి చేసుకోక ముందు జెమినీ గణేషన్ పుష్పవల్లిని పెళ్లి చేసుకున్నాడు. పుష్పవల్లికి గణేషన్‌కి పుట్టిన పాపే రేఖ.

2. సుహాసిని-కమల్ హాసన్

సుహాసిని గురించి తెలియని వారు ఉండరు. కొన్ని నెలల క్రితం తెలుగులో హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది. చాలా ట్రెడిషనల్‌గా కనిపించే ఈ తార హాట్ సన్నివేశాల్లో కూడా నటించి ఒక ఊపు ఊపింది. అయితే ఈమెకు దిగ్గజ నటుడు కమల్ స్వయానా బాబాయ్. కమల్ అన్నయ్య చారు హాసన్‌కి సుహాసిని పుట్టింది. ఈమె మణిరత్నంని పెళ్లి చేసుకుంది.

3. విజయనిర్మల – జయసుధ

దివంగత నటి, దర్శకురాలు విజయనిర్మల నేచురల్ యాక్ట్రెస్ జయసుధకు వరుసకు అత్తయ్య అవుతుంది. జయసుధ దెయ్యం, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, బొమ్మరిల్లు, కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాలలో నటించి సూపర్ పాపులర్ అయింది.

4. విద్యాబాలన్-ప్రియమణి

బాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ విద్యాబాలన్, టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణికి కజిన్ అవుతుంది. ప్రియమణి సింగర్ మాల్గుడి శుభకు మేనకోడలు కూడా అవుతుంది.

5. ఐశ్వర్య రాజేష్- శ్రీలక్ష్మి

యంగ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రముఖ లేడీ కమెడియన్ శ్రీలక్ష్మికి స్వయానా మేనకోడలు అవుతుంది. శ్రీలక్ష్మి బ్రదర్‌కి ఐశ్వర్య జన్మించింది.

Share post:

Latest