ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే నాని `ద‌స‌రా` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్టే!

న్యాచుర‌ల్ స్టార్ నాని కెరీర్ తెర‌కెక్కిన తొలి పాన్ ఇండియా చిత్రం `ద‌స‌రా`. శ్రీకాంత్ ఓదెల ఈ మూవీకి దర్శకత్వం వ‌హించ‌గా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇందులో జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టించింది. సాయి కుమార్, సముద్రఖని, జరీనా వహాబ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

మార్చి 30న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. గోదావరిఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెలంగాణ బ్యాక్‌డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో మ‌రింత హైప్‌ను పెంచుతున్నారు. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. తెలంగాణ బ్యాక్‌డ్రాప్ టాలీవుడ్‌లో స‌క్సెస్ ఫార్ములాగా మారిపోయింది.

గ‌త కొన్నేళ్ల‌లో ఫిదా, ల‌వ్‌స్టోరీ, వాల్తేర్ వీర‌య్య‌తో పాటు ఇటీవ‌ల విడుద‌లైన బ‌ల‌గం వ‌ర‌కు తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ప‌లు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ డూప‌ర్ హిట్స్ గా నిలిచాయి. దీంతో తెలంగాణ బ్యాక్‌డ్రాప్ లో సినిమా వ‌స్తే హిట్ అనే సెంటిమెంట్ టాలీవుడ్ లో ఏర్ప‌డింది. ఇప్పుడు ద‌స‌రా విష‌యంలోనూ ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే.. సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్టే అని అభిమానులు భావిస్తున్నారు. అదే జ‌రిగితే నాని ద‌శ మారిపోవ‌డం ఖాయ‌మ‌వుతుంది.

Share post:

Latest