ప‌విత్ర‌తో పెళ్లిపై తొలిసారి స్పందించిన న‌రేష్‌.. ఏమ‌న్నాడంటే?

సీనియ‌ర్ న‌టుడు వీకే నరేష్ ప్ర‌ముఖ న‌టి పవిత్ర లోకేష్ పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. గ‌త కొన్నేళ్ల నుంచి స‌హ‌జీవ‌నం చేస్తున్న ఈ జంట‌.. ఫైన‌ల్ గా మూడు ముళ్ల బంధంతో ఒక‌ట‌య్యారు. `ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్ళు, ఏడు అడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు మీ ప‌విత్ర‌న‌రేష్‌` అంటూ ట్విట్ట‌ర్ ద్వారా త‌మ పెళ్లి వీడియోను న‌రేష్‌ పోస్ట్ చేశాడు.

దీంతో టాలీవుడ్ లో వీరి పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. అంద‌రూ ప‌విత్ర‌, న‌రేష్ పెళ్లి గురించే చ‌ర్చించుకుంటున్నారు. కొంద‌రు వీరి పెళ్లి నిజం కాద‌ని.. ఇదొక సినిమా ప్ర‌మోష‌న‌ల్ స్టంట్ అని కొట్టిపారేస్తున్నారు. అయితే తాజాగా ప‌విత్ర‌తో పెళ్లిపై న‌రేష్ తొలిసారి స్పందించాడు. `ఇంటింటి రామాయణం` అనే మూవీ ప్రెస్ మీట్ లో న‌రేష్‌ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు నాలుగో పెళ్లిపై ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. మొద‌ట పెళ్లిపై మాట దాట‌వేసినా.. చివ‌ర‌కు స్పందించ‌క త‌ప్ప‌లేదు.

`ఈ టాపిక్‌ని డైవర్ట్ చేయదలుచుకోలేదు. దానికి సంబంధించి త్వరలోనే ఓ ప్రెస్‌మీట్‌ పెడతాను. రీల్‌ లైఫ్‌, రియల్‌ లైఫ్‌ ప్రతి వ్యక్తికి ఉంటాయి. నా లైఫ్‌ని నేను జీవిస్తున్నా. ఈ ప్రెస్‌ మీట్‌ని మరో విధంగా డైవర్ట్ చేయదలుచుకోవడం లేదు` అని తెలివిగా త‌ప్పించుకున్నారు. ప్రస్తుతానికి తన పెళ్లి ప్రస్తావనకి ఫుల్‌ స్టాప్‌ పెట్టారు.

Share post:

Latest