ట్రైలర్: కామెడీతో అదరగొట్టేస్తున్న కాజల్ కోస్టి ట్రైలర్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. హీరోయిన్స్ ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు..కానీ ఈమె మాత్రం అడపాదడపా సినిమాలలో చేస్తూ ఇండస్ట్రీలోనే ఉండిపోయింది. ఒక్క తెలుగులోనే కాకుండా కోలీవుడ్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి అక్కడ కూడా మంచి గుర్తింపు సంపాదించింది. ఈ మధ్యనే వివాహం చేసుకోని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇప్పుడు కాజల్ ,బాలయ్య సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా ఈ విషయంపై క్లారిటీ రాలేదు.

Ghosty Official Trailer | Kajal Aggarwal, K.S.Ravikumar, Yogi Babu | Sam CS  | Tamil cinema - YouTube

అయితే ఈ అమ్మడు ఇప్పుడు తమిళంలో నటించిన సినిమా తెలుగులో కోస్టి గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా మార్చి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే హర్రర్ కామెడీ కాన్సెప్ట్ తో రూపొందించిన సినిమాలా అనిపిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ట్రైలర్ ని చూస్తుంటే అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని నమ్మకం కలుగుతోంది అభిమానులకు. ఈ ట్రైలర్లో పలు కమెడియన్సు కూడా కనిపిస్తున్నారు. వీరందరూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే ఇందులో భయపడే పోలీస్ పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపించబోతోందనీ ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

అంతేకాకుండా కాజల్ అగర్వాల్ ,ఆ దెయ్యాలకు సంబంధం ఏంటి? వాటినుండి కాజల్ అగర్వాల్ ఎలా తప్పించుకుంటారు. అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ తో పాటు యోగిబాబు ఊర్వసి.. సత్యన్.. కేఎస్ రవికుమార్.. మనోబాల ఇంకా పలువురు తమిళ్ స్టార్ నటీనట్లు కనిపించబోతున్నారు. ఈ సినిమా విడుదలయ్యేటప్పుడు ఎలాంటి బడా సినిమాలు లేవు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి

Share post:

Latest