సాయి పల్లవికి చుక్కలు చూపించిన ఆ సినిమా.. రెండేళ్ల పాటు తట్టుకోలేక..!!

ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సాయి పల్లవి. మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఆ తరువాత స్టార్ హీరోల కోసం కూడా సాయి పల్లవికి అవకాశాలు వచ్చాయి. కానీ తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండాలని సినిమాకి గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేది ఈ నేచరల్ బ్యూటీ. మిడిల్ క్లాస్ అబ్బాయి, పడి పడి లేచే మనసు, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం చిత్రాలతో హిట్స్ అందుకున్న సాయి పల్లవి చివరిసారిగా ‘గార్గి’ చిత్రంలో కనిపించింది.

తమిళ్, తెలుగు భాషలో రూపొందించిన ఈ సినిమా కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీ తర్వాత సాయి పల్లవి నుంచి మరో ప్రాజెక్ట్ అప్డేట్ రాలేదు. దీంతో సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందంటూ ప్రచారం నడిచింది. గత కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్న ఈ వార్తలపై సాయి పల్లవి ఇప్పటివరకు స్పందించలేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ పాన్ ఇండియా ఫిల్మ్ చేయబోతుందని, ఆ సినిమా కోసం ఏకంగా 2 సంవత్సరాలు కాల్షిట్స్ కేటాయించిందని ఇంకో వార్త చక్కర్లు కొడుతుంది.

తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో పాన్ ఇండియా లెవల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రామాయణం చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ ప్రధాన పాత్రలలో నటించనున్నారని సమాచారం. అయితే ఇందులోని సీత పాత్ర కోసం ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సాయి పల్లవి సంప్రదించారట. స్టోరీ నచ్చడంతో నేచురల్ బ్యూటీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే ఈ సినిమాలో నటించేందుకు సాయి పల్లవి ఏకంగా రెండేళ్లు కాల్షీట్స్ ఇచ్చిందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ రెండేళ్లలో ఈ అమ్మడు వేరే సినిమాల్లో నటించదట. కాల్ షీట్స్ మొత్తం ఒకే సినిమాకి ఇవ్వడం వల్లే ఈ సాయి పల్లవికి తలనొప్పులు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం ఎంతవరకు నిజమనేది మాత్రం ఇంకా తెలీదు.

Share post:

Latest