టీజర్: ఎమోషనల్ తో ఆకట్టుకుంటున్న రంగమార్తాండ టీజర్..!!

డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన తాజా చిత్రం రంగమార్తాండ. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండడం విశేషమని చెప్పవచ్చు. డైరెక్టర్ కృష్ణవంశీ చాలాకాలం తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన భారీగానే అంచనాలు నెలకొంటున్నాయి. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు సమర్పణలో నిర్మిస్తూ ఉన్నారు. మార్చి 22న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ని వేగవంతం చేసింది.

Rangamarthanda teaser: Prakash Raj, Ramya Krishna, Brahmanandam in a  heart-wrenching drama

ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేయడం జరిగింది.. ఈ టీజర్లో చిరంజీవి వాయిస్ తో నేను ఒక నటుడిని అంటూ ఈ టీజర్ మొదలవుతుంది.. ప్రకాష్ రాజ్ ను సన్మానిస్తున్న ఒక వీడియోతో మొదలవుతుంది. ఆ తర్వాత బ్రహ్మానందం ప్రకాష్ రాజ్ చెంప చెల్లుమనిపిస్తూ నువ్వు ఒక చెత్త నటుడిది రా అంటూ మనిషి కంటే నీచుడివిరా అంటూ బ్రహ్మానందం చెప్పా డైలాగ్ హైలైట్ గా నిలుస్తోంది.

ఇక రంగమార్తాండ రాఘవరావుని అంటూ ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్ తో టీజర్ ముగిస్తుంది. అయితే ఈ సినిమాలో తాజాగా నటించే నటి నటుల ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఇందులో రాహుల్ సింప్లీగంజ్, అనసూయ, శివాత్మిక రాజశేఖర్ తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదలైన పోస్టర్లు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఉంటుందని అభిమానులు తెలియజేస్తున్నారు. మరి ఈ సినిమా విడుదల ఏ మేరకు నేర్పిస్తుందో చూడాలి మరి.

Share post:

Latest