జనసేనతోనే సిటీ సీట్లలో టీడీపీకి ప్లస్..వైసీపీకి చెక్!

టీడీపీ-జనసేన కలిస్తే వైసీపీకి షాక్ తప్పదని చెప్పవచ్చు..కానీ రెండు పార్టీలు వేరు వేరుగా పోటీ చేస్తే మాత్రం వైసీపీకి లాభమే. గత ఎన్నికల్లో అదే జరిగింది. ఇటీవల వచ్చిన సర్వేల్లో కూడా అదే తేలింది. కాస్త టి‌డి‌పికి లీడ్ ఉన్నా సరే..జనసేన వల్ల టి‌డి‌పికి నష్టం జరగడం ఖాయమని తేలింది. అదే సమయంలో వైసీపీకి కొన్ని సీట్లలో బెనిఫిట్ ఉంది.

ఇక రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే చాలా సీట్లలో ఫలితాలు తారుమారు అయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా అర్బన్ సీట్లలో వైసీపీకి షాక్ తప్పదు. ఇటీవల వచ్చిన సర్వేలో అర్బన్ సీట్లలో మెజారిటీ టి‌డి‌పికే ఉంది. కానీ జనసేన వల్ల కొన్ని సీట్లలో ఓట్లు చీలిపోయి టి‌డి‌పికి నష్టం జరుగుతుందని తేలింది. ఉదాహరణకు విశాఖ సిటీలో నాలుగు సీట్లు ఉన్నాయి. అందులో విశాఖ ఈస్ట్, వెస్ట్ సీట్లు టి‌డి‌పి, నార్త్, సౌత్ సీట్లు వైసీపీ గెలుస్తుందని తేలింది. ఒకవేళ టి‌డి‌పి-జనసేన కలిస్తే నార్త్, సౌత్ సీట్లలో కూడా గెలిచే అవకాశం ఉంది.

ఇటు కాకినాడ సిటీ సీటు వైసీపీ గెలుస్తుందని, కాకినాడ రూరల్ లో టఫ్ ఫైట్ ఉందని తేలింది. అయితే టి‌డి‌పి-జనసేన కలిస్తే రెండు సీట్లలో గెలవడం ఖాయమే. అటు రాజమండ్రి సిటీ సీటు టి‌డి‌పి గెలుస్తుందని, ఇటు రాజమండ్రి రూరల్ జనసేన గెలుస్తుందని సర్వేలో తెలిసింది. ఇక ఏలూరు సిటీ సీటు వైసీపీ గెలుచుకుంటుందని తెలిసింది. పొత్తు ఉంటే ఇక్కడ వైసీపీ గెలవడం కష్టమే. అలాగే విజయవాడ ఈస్ట్, సెంట్రల్ లో టి‌డి‌పి, విజయవాడ వెస్ట్ లో టఫ్ ఫైట్ ఉంది. పొత్తు ఉంటే వెస్ట్ కూడా గెలిచేస్తారు.

గుంటూరు ఈస్ట్ వైసీపీ, గుంటూరు వెస్ట్ టఫ్ ఫైట్. పొత్తు ఉంటే రెండు సీట్లలో వైసీపీ గెలుపు గగనమే. అటు తిరుపతి, చిత్తూరు, కర్నూలు సిటీ సీట్లలో కూడా పొత్తు ప్రభావం ఉండే ఛాన్స్ ఉంది.

Share post:

Latest