పవన్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్న తారక్ ఫ్యాన్స్.. కారణం..?

ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలైన తర్వాత అటు రామ్ చరణ్, ఇటు ఎన్టీఆర్ మధ్య సన్నిహితం మరింత పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే మెగా – నందమూరి అభిమానుల మధ్య మరింత సాన్నిహిత్యం పెరుగుతుందని అందరూ అనుకుంటుంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే దూరం అంతకంతకూ పెరిగిపోతోంది. ఎవరు గొప్ప అనే చర్చ తెరపైకి రావడంతో మంట మరింతగా చెలరేగుతోంది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి ఈ చర్చ మొదలయ్యింది.. ఎన్టీఆర్ ని రాజమౌళి తగ్గించేసాడని ఒక వర్గం ప్రజలు ఆరోపణలు కూడా చేశారు. ఈ క్రమంలోని ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుండి రాజమౌళికి అసభ్యకర సందేశాలు, వేధింపులు కూడా ఎదురయ్యాయి.

Thumbnail confusion about Pawan Kalyan and Jr NTR

ఆ తర్వాత అంతర్జాతీయంగా వేదికలలో ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపించింది. ది వెరైటీ మ్యాగజైన్ ఆస్కార్ ప్రిడిక్షన్ లిస్టులో ఎన్టీఆర్ పేరు చేర్చింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ అభిమానులు గొప్పగా ప్రచారం చేసుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ గొప్ప.. మా వాడిది ఆస్కార్ రేంజ్ పెర్ఫార్మెన్స్.. అంటూ సోషల్ మీడియాను హోరెత్తించారు. కానీ ఎన్టీఆర్ కి ఆస్కార్ కు నామినేట్ దక్కలేదు .ఆ తర్వాత రామ్ చరణ్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు . గుడ్ మార్నింగ్ అమెరికా షో కి హాజరయ్యాడు. ఆ ఘనత అందుకున్న మొదటి ఇండియన్ హీరోగా రికార్డ్ సృష్టించాడు.

అంతేకాదు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ఈవెంట్ కి రామ్ చరణ్ అతిధుల్లో ఒకరిగా హాజరై ఆయన చేతులు మీదుగా అవార్డు ప్రధానం చేశారు.. అలాగే స్పాట్ లైట్ అవార్డుతో సత్కరించబడ్డారు. దీంతో అసహనం వ్యక్తం చేశారు ఎన్టీఆర్ అభిమానులు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ఒక లెటర్ హెడ్ వాళ్ల కోపాన్ని రెట్టింపు చేసిందిరామ్ చరణ్ HCA అవార్డు వేడుకల్లో విశిష్ట గౌరవం పొందడంతో అభినందిస్తూ పవన్ కళ్యాణ్ లెటర్ హెడ్ విడుదల చేశారు.. అక్కడ ఎన్టీఆర్ పేరును ప్రస్తావించలేదు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతూ 2024 అసెంబ్లీ ఎన్నికలలో నీకు మా సపోర్టు ఉండదు అంటూ పరోక్షంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

Share post:

Latest