హతవిధీ.. సినిమా స్టోరీ కూడా అర్థం చేసుకోలేని స్టార్ హీరోయిన్..

హీరో నాని నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ‘దసరా’. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మూవీ యూనిట్ ప్రమోషన్ల కోసం భారతదేశంలోని పలు నగరాలను పర్యటిస్తూ బిజీగా ఉన్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా సినిమా లో నేచరల్ స్టార్ నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. అయితే తాజాగా కీర్తి సురేష్ కి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని నాని వెల్లడించాడు.

నాని మాట్లాడుతూ మొదట దసరా సినిమా స్క్రిప్ట్‌ను కీర్తి కి చెప్పినప్పుడు ఆమెకి ఒక్క బిట్ కూడా అర్థం కాలేదని వెల్లడించారు. దర్శకుడు శ్రీకాంత్ మూడు గంటలకు పైగా తెలంగాణ యాసలో కీర్తికి స్క్రిప్ట్ చెప్పారని నాని అన్నారు. కీర్తికి తెలుగు అర్థం అవుతుంది కానీ ఆమెకు తెలంగాణ యాస తెలియదు అని ఆయన చెప్పారు. ఆ సమయంలో నాని కీర్తికి ఫోన్ చేసి తన అభిప్రాయాన్ని అడిగితే ఆమెకి స్క్రిప్ట్ అర్థం కావడం లేదని చెప్పుకొచ్చిందట.

తరువాత, ట్రాన్సలేటర్ సహాయంతో స్క్రిప్ట్‌ని మళ్ళొసారి ఆమెకు వినిపించారట. అది విన్న కీర్తి ఎలాంటి ఏం ఆలోచనలు పెట్టుకోకుండా వెంటనే సినిమా చేయడానికి అంగీకరించింది. ‘నేను లోకల్’ సినిమా తర్వాత నాని, కీర్తి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ‘దసరా’. ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు . మరి ఈ సినిమాపై ప్రేక్షకులకు పెట్టుకున్న అంచనాలను మన నేచరల్ స్టార్ అందుకుంటాడో లేదో చూడాలి.

Share post:

Latest