32 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ ఖాళీగా లేనంటే అదే కార‌ణం.. శ్రీ‌కాంత్ ఓపెన్ కామెంట్స్‌!

ప్ర‌ముఖ న‌టుడు శ్రీ‌కాంత్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 1991లో వ‌చ్చిన `పీపుల్స్ ఎన్ కౌంటర్` మూవీతో శ్రీ‌కాంత్ సినీ కెరీర్ ప్రారంభం అయింది. ఆ త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. వ‌ర‌స‌గా అవ‌కాశాలు అందుకుంటూ అన‌తి కాలంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. చాలా వేగంగా వంద సినిమాల‌ను పూర్తి చేశారు.

స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన ఆయ‌న‌.. ప్ర‌స్తుతం స‌హాక పాత్ర‌ల‌ను పోషిస్తూ స‌త్తా చాటుతున్నారు. అలాగే విల‌న్ గా కూడా మెప్పిస్తున్నారు. అయితే నేడు శ్రీ‌కాంత్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఆయ‌న ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకున్నారు. త‌న 32 ఏళ్ల సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ 32 ఏళ్లలో ఖాళీ లేకుండా ఎప్పుడూ వరుస సినిమాలను చేస్తూనే వెళుతున్నాను. సినిమాల్లో ట్రై చేసేటప్పుడు కూడా నాకు ఆకలి కష్టాలు తెలియదు.

ఇంటి దగ్గర నుంచి మా నాన్న డ‌బ్బులు పంపిస్తూనే ఉండేవారు. మా నాన్న నాకు ఇచ్చిన గ‌డువులోనే సినిమాల్లో అవ‌కాశాలు ద‌క్కించుకున్నాను. ఆ త‌ర్వాత ఎప్పుడూ వెనుదిరిగి చూసుకోలేదు. నేను మంచి నటుడిని కావడం వల్లే నాకు వ‌రుస ఆఫ‌ర్లు వచ్చాయని చెప్పను. ఎప్పుడూ ఏ నిర్మాతనుగానీ .. దర్శకుడిగాని నేను ఇబ్బంది పెట్టలేదు. నా క్రమశిక్షణ, మంచి బిహేవియర్ వల్లనే అవకాశాలు వచ్చాయని నమ్ముతాను` అంటూ శ్రీ‌కాంత్ చెప్పుకొచ్చారు. కాగా, ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌న్ `ఆర్సీ15`, తార‌క్ `ఎన్టీఆర్ 30`తో ఎన్నో బిగ్ ప్రాజెక్ట్స్ లో భాగం అయ్యారు. త‌మిళంలోనూ ప‌లు సినిమాలు చేస్తున్నారు.