ఖాళీ టైమ్‌లో శ్రీదేవి కూతురు అలాంటి పనులు.. ఇదేం బుద్ది అంటూ నెటిజన్లు చివాట్లు!

ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్న వయసులోనే ఎంతో జీవితాన్ని చూసింది. తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. అయితే జాన్వీ తన కెరీర్, కలల గురించి అభిమానులతో పంచుకుంది. జాన్వీ కపూర్ కి ప్రేమ కథ చిత్రాలో నటించడం చాలా ఇష్టమట. దాని వళ్ల ప్రేక్షకులకు తొందరగా దగ్గరివుందని ఆమె ఆశ. శ్రీదేవి, కరీనా కపూర్, అలియా భట్ లాంటి వాళ్ళలా వెరైటీ పాత్రలో నటిస్తానని జాన్వీ చెబుతుంది.

శ్రీదేవి, బోనీకపూర్‌ల కూతురిగా కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటుంది. ఎలాంటి సందర్భంలో అయినా జాన్వీకి తన కుటుంబం తోడుగా ఉంటుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కేవలం వారు నా సంతోషం మాత్రమే పంచుకోవాలి విమర్శలను నేను ఒంటరిగానే ఎదుర్కొంటాను అని ఆమె చెప్తుంది. నా పై వచ్చే విమర్శలకు నేనే సమాధానం ఇవ్వాలి అని అనుకుంటున్నాను అని ఆమె చెప్పింది.

“ఎప్పుడు నేను అనుకున్నది జరగాలి అని ఏం లేదు. ఒకోసారి దురదృష్టం మన అంచనాలను తలకిందులు చేసే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మంచి చెడు రెండిటినీ స్వీకరించే గుణం ఉండాలని జాన్వీ చెప్తున్నారు. ఇదంతా తన తల్లిని చూసి నేర్చుకుందట. కాబట్టి ఎలాంటి ఫలితమైనా ఆమెపై పెద్దగా ప్రభావం చూపించట. సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి కొంతమంది ఎలా పడితే అలా రాస్తున్నారు. అలానే జాన్వీ గురించి కూడా ఒకరూ ‘నీకు యాక్టింగ్ రానప్పుడు, వృథా ప్రయత్నం ఎందుకు చేస్తున్నావ్?’ అని ప్రశ్నించారట. దానికి సమాధానం చెప్పడానికి నాకు ఒక్క నిమిషం చాలు కానీ నేను నటనతో అలాంటి వారిందరికీ సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను” అని జాన్వీ వివరించింది.

 

 

Share post:

Latest