శ్రీ‌ముఖికి మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌.. రాముల‌మ్మ నిజంగా ల‌క్కీనే!?

బుల్లితెర రాములమ్మ, స్టార్ యాంకర్ శ్రీముఖి ఇటీవల వెండితెరపై బ్యాక్ టు బ్యాక్ ఆఫర్ల‌తో ఫుల్ బిజీగా మారుతుంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న `భోళా శంకర్‌` సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఎంపిక అయింది. అయితే తాజాగా ఈ బ్యూటీ మరో బంపర్ ఆఫర్ ను కొట్టేసింది.

నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాలో శ్రీముఖి నటించబోతోంది. ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎన్‌బీకే108` వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కథ తండ్రి కూతురు మధ్య సాగుతుంది. ఇందులో బాలయ్య కూతురుగా యంగ్ బ్యూటీ శ్రీలీల నటించబోతోంది.

అయితే ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం శ్రీముఖిని తీసుకున్నారట. మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోయే నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్‌లో శ్రీముఖి జాయిన్ కానుందని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో శ్రీముఖి పాత్రకు మంచి ప్రాధాన్యత కూడా ఉంటుందట. ఈ విష‌యం తెలిసి రాముల‌మ్మ నిజంగా ల‌క్కీనే అంటూ నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Share post:

Latest