ఎక్కడో ఏదో తేడా కొడుతుందే.. విశ్వక్‌సేన్ అసలెందుకు సైలెంట్ అయిపోయాడు??

యంగ్ హీరో విశ్వక్‌సేన్ నటించిన సినిమా ‘దాస్ కా దమ్కి’. ఈ సినిమాకి హీరో, దర్శకుడు రెండూ విశ్వక్‌సేన్‌యే. దాస్ కా దమ్కి సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా కూడా ఇంకా ప్రమోషన్‌కి సంబంధించిన కార్యక్రమాలు మొదలు పెట్టకపోవడం గమనార్హం. నిజానికి ఫిబ్రవరి నెలలోనే ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి విశ్వక్ సేన్ ప్రయత్నాలు చేశాడు. కానీ అదే నెలలో వేరే సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండడం, అలానే ఇంకొన్ని కారణాల వల్ల “దాస్ కా దమ్కి” సినిమా విడుదలను పోస్టుపోన్ చేసారు.

అయితే ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విశ్వక్‌సేన్ లో సినిమా ప్రమోషన్స్ గురించి ఎటువంటి ఆలోచన లేదు. అసలు ఇప్పటి వరకు ప్రమోషన్ కార్యక్రమాలలో స్పీడ్ పెంచకపోవడంతో మళ్ళీ సినిమా వాయిదా పడబోతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోగా డబుల్ రోల్ లో నటించిన విశ్వక్‌సేన్ చాలా నమ్మకం పెట్టుకొని నిర్మించినట్లుగా చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను అలరించాయి. అలా సినిమాకి సంబంధించినంత వరకు పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ అయిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి సమయంలో భారీగా ప్రమోషన్ చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యులు పబ్లిసిటీ విషయంలో సైలెంట్‌గా ఉండడం పట్ల అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

దాంతో అసలు విశ్వక్‌సేన్ ఈ నెలలో అయినా తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడా? లేదా? అనే అనుమానం వ్యక్తం అవుతుంది. ఈ రెండు మూడు రోజుల్లో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టకపోతే మాత్రం మళ్ళీ సినిమా వాయిదా పడ్డట్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

Share post:

Latest