ఒంటరి అవుతున్న తారక్.. జాగ్రత్త పడాల్సిందేనా..?

నందమూరి వారసుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రతి ఒక్కరికి అభిమానమే కాదు అంతకుమించిన గౌరవం కూడా.. ఇకపోతే ఒకప్పుడు బాబాయ్ బాలకృష్ణ సపోర్ట్ బాగానే ఉండేది. అయితే ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ అటు బాలయ్య, ఇటు తారక్ మధ్య గ్యాప్ ఏర్పడిందని అటు పొలిటికల్ ఇటు సినీ, మీడియా వర్గాలలో కూడా చర్చ నడుస్తోంది.. ఎన్టీఆర్ ప్రస్తుతం పలు ప్రాజెక్టు లు కూడా ప్రత్యేకంగా ఉండేలా కచ్చితంగా అంచనాలను అందుకోవడంతోపాటు సక్సెస్ సాధించేలా తన కెరియర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇకపోతే కెరియర్ పరంగా అన్ని వ్యవహారాలను చక్కబెట్టే విషయంలో మరొక వ్యక్తి సపోర్ట్ అవసరం అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఇతర హీరోలకు వాళ్ళ భార్య నుంచి, స్నేహితుల నుంచి సపోర్టు లభిస్తుండగా ఎన్టీఆర్ కి మాత్రం ఈ విషయంలో సమస్యలు బాగా ఎదురవుతున్నాయని చెప్పాలి. ఆయన సినిమాల అప్డేట్స్ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొనడానికి కూడా కారణం ఇదే అని అభిమానుల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇకపోతే సోషల్ మీడియాపై ఇతర స్టార్స్ ఫోకస్ పెట్టిన స్థాయిలో ఎన్టీఆర్ దృష్టి పెట్టడం లేదు. పాన్ ఇండియా ఇమేజ్ మరింత పెరగడంతో పాటు మరిన్ని ఇండస్ట్రీ హిట్లు ఖాతాలో చేరాలంటే ఏ విషయంలోనూ ఎన్టీఆర్ పొరపాట్లు చేయకూడదు.

ఇకపోతే ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న ఈయనతో ఒక్క సినిమా అయినా చేయాలని క్యూ కడుతున్న వాళ్ళ జాబితా కూడా అంతకంతకు పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ ఆచితూచి అడుగులు వేయాలి.. జాగ్రత్త పడాలి.. లేకపోతే ఒంటరి అయిపోతారు అనే కామెంట్లు కూడా అభిమానుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఎవరి సపోర్ట్ లేకుండా సక్సెస్ అయ్యే సత్తా ఎన్టీఆర్ కి ఉంది అని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Latest