నువ్వు వర్జినా..? నెటిజ‌న్ తిక్క ప్ర‌శ్న‌కు శృతి దిమ్మ‌తిరిగే కౌంట‌ర్‌!

శృతి హాస‌న్‌.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. లెజెండ్రీ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ కూతురుగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ తన‌దైన టాలెంట్ తో ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం వ‌రుస హిట్ల‌తో కెరీర్ ప‌రంగా దూసుకుపోతోంది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో ఈ ఏడాదిని ఘ‌నంగా ప్రారంభించింది.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ కు జోడీగా శృతి హాజ‌ర్ `స‌లార్‌` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగం అయింది. అలాగే కోలీవుడ్, హాలీవుడ్ భాష‌ల్లోనూ న‌టిస్తోంది. ఇక‌పోతే సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్ గా ఉండే శృతి హాస‌న్.. త‌ర‌చూ త‌న ఫాలోవ‌ర్స్ తో చిట్ చాట్ చేస్తుంటుంది. తాజాగా కూడా అభిమానులతో ఇన్‌స్టా వేదికగా ముచ్చ‌ట్లు పెట్టింది. నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో స‌మాధానాలు ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే ఓ నెటిజ‌న్ ఏకంగా `ఆర్ యూ వర్జిన్ ?` అంటూ తిక్క ప్రశ్న వేశాడు. అయితే వ‌ర్జిన్ స్పిల్లింగ్ ను త‌ప్పుగా రాశాడు.

దాంతో శృతి హాసన్ `ముందు నువ్వు స్పెల్లింగ్ కరెక్ట్ రాయడం నేర్చుకో..` అంటూ దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చింది. మ‌రో నెటిజ‌న్ `నేను మీతో డేటింగ్ చేయాలనుకుంటున్నాను ?`అంటూ కామెంట్ చేయగా.. అందుకు శృతి నో చెప్పేసింది. ఇంకొక నెటిజ‌న్.. విస్కీ, బీర్, కాక్‌టెయిల్ మరియు వోడ్కా నుండి మీ ఇష్టమైన డ్రింక్ ఎంచుకోమని శృతి హాసన్‌ను అడిగాడు. అయితే, తాను గ‌త ఆరు సంవ‌త్స‌రాల నుంచి మద్యం సేవించడం లేద‌ని.. కాబ‌ట్టి వాటిలో త‌న‌కు ఇష్టమైనది ఏమీ లేద‌ని తెలిపింది. అయితే కొన్నిసార్లు ఆల్కహాల్ లేని బీర్ తాగుతాన‌ని శృతి పేర్కొంది.

Share post:

Latest