నందమూరి కుటుంబం పై పోసాని సంచలన వ్యాఖ్యలు..!!

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. RRR చిత్రంతో మరింత పెరిగిపోయి గ్లోబల్ స్టార్ గా కూడా పేరు సంపాదించారు. సినిమాల విషయం పక్కన పెడితే రాజకీయాలలో కూడా ఎన్టీఆర్ పేరు తరచూ ఎక్కువగా వినిపిస్తూ ఉంటోంది. ముఖ్యంగా తన తాత పోలికలతో ఉన్న ఎన్టీఆర్ రాజకీయాల్లో సత్తా చాటాలని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంగా తెలియజేస్తూ ఉంటారు. ఈ విషయంపై నందమూరి అభిమానులు కూడా మద్దతు తెలుపుతూ ఉంటారు.

Posani Krishna Murali Controversial Comments On Jr NTR || Filmibeat Telugu  - video Dailymotion

టిడిపి శ్రేణులు చాలామంది ఇది అభిప్రాయాన్ని ఎన్నోసార్లు తెలియజేయడం జరిగింది .ఎన్టీఆర్కు సీఎం అయ్యే సత్తా ఉందంటూ తెలియజేస్తూ ఉంటారు. ఇటీవల టిడిపి నేత నారా లోకేష్ కూడా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఎన్టీఆర్ దృష్టి అంతా ఎక్కువగా సినిమాలపైనే ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి ఎన్టీఆర్ పై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న పోసాని ఇటీవల ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.

సీనియర్ ఎన్టీఆర్ ఆరోగ్యంతో ఉన్న పరిస్థితుల్లో ఆమె భార్య మరణించింది.. అలాంటి సమయంలో ఎన్టీఆర్కు అండగా ఉన్న లక్ష్మీపార్వతి ఆయనను వివాహం చేసుకున్నారు.. అలాంటి మహిళను పట్టుకొని చంద్రబాబు టీడీపీ వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. ఇదే లక్ష్మీపార్వతిని తిట్టేవాళ్ళు హరికృష్ణ రెండవ భార్య తారక్ తల్లిని తిట్టే ధైర్యం మాత్రం చేయలేదు ఎందుకంటే అలా చేస్తే జూనియర్ ఎన్టీఆర్ ఊరుకోరు కదా అంటూ తెలిపారు. ఎన్టీఆర్ నంబర్ వన్ హీరో కాబట్టి భయపడుతున్నారు పైగా అతనితో చంద్రబాబుకు చాలా అవసరం ఉంది చాలా వాంటెడ్ పర్సన్ ముఖ్యమంత్రి అవ్వ గల కెపాసిటీ ఎన్టీఆర్ కు మాత్రమే ఉందని అతనితో మంచిగా ఉంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓట్లని తమకే పడతాయని అందువల్లే చంద్రబాబు ఏమనలేదని పోసాని తెలిపారు

Share post:

Latest