రాజమౌళి పై షాకింగ్ కామెంట్లు చేసిన RRR నిర్మాత..!!

డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం RRR. తెలుగు రాష్ట్రాలలో భారతీయులు అంత నాటు నాటు పాటకు వచ్చిన ఆస్కార్ అవార్డుతో చాలా సంబరపడిపోతున్నారు. అయితే ఇంత సంతోషపడే విషయంలో RRR చిత్రాన్ని నిర్మించిన నిర్మాత దానయ్య పాలు పంచుకోకపోవడం అనేది అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది .అసలు దానయ్య ఈ ఆస్కార్ వేడుకకు ఎందుకు దూరంగా ఉన్నారనే విషయం అందరిలోనూ మొదలుతోంది. ఏవేవో కారణాలు వినిపించిన ఇప్పుడు RRR సినిమాకి ఆస్కార్ వచ్చిన సందర్భంలో దానయ్య మీడియాతో మాట్లాడడం జరిగింది. RRR చిత్ర బృందానికి రాజమౌళి ఎన్టీఆర్ చరణ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి వాటి గురించి చూద్దాం

RRR: Producer Danayya's distance at the Oscars, the reason

రాజమౌళితో సినిమా చేయాలని కోరిక తో 2006లో అడ్వాన్సును ఇచ్చాను ఆ తర్వాత మర్యాద రామన్న చేద్దామని రాజమౌళి అడిగిన ఇంకా పెద్ద సినిమా చేద్దామన్నాను ఆ తర్వాత రెండు సినిమాలయ్యాక RRR సినిమా పట్టాలెక్కింది. ఇద్దరు స్టార్ హీరోలతో ఈ సినిమా మొదలవుతుందని అసలు ఊహించలేదు. ఈ సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువగానే అయిందని తెలిపారు దానయ్య. ముఖ్యంగా కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాము ఎంతో కష్టపడి సినిమా అని విడుదల చేశాము ఆ కష్టానికి ప్రతిఫలమే ఈ ఆస్కార్ అవార్డు వచ్చింది అంటూ తెలిపారు.

ఈ పాట కోసం 30 రోజులు రిహార్సల్ 17 రోజులపాటు ఉక్రెయిన్ లో చిత్రీకరణ చేపట్టామని తెలిపారు. ఈ సాంగ్ కి ఆస్కార్ రావడం తనకు కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తోందని తెలిపారు. ఈ పాట మొత్తం రాజమౌళి క్రెడిట్ కి దక్కుతుంది ఆస్కార్ ప్రకటించాక రాజమౌళి ఫోన్ చేస్తే పార్టీలో బిజీగా ఉండి స్పందించలేదు.. ఎన్టీఆర్ రామ్ చరణ్ లతో కూడా కాంటాక్ట్ లో లేను అంటూ దానయ్య చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. దీంతో రాజమౌళి ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంపై నెటిజన్లు పలు రకాలుగా రియాక్ట్ అవుతున్నారు.

Share post:

Latest