`ఆర్ఆర్ఆర్‌`ను వ‌రించిన ఆస్కార్‌.. సంబరాల్లో భార‌తీయులు!

భార‌తీయ సినీ ప్రియులు ఊహించినట్లుగానే `ఆర్ఆర్ఆర్‌`ను ఆస్కార్ అవార్డు వరించింది. లాస్ ఏంజెల్స్‌లో ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున) జరిగిన 95వ అకాడమీ వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది.

ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డును ఆర్ఆర్ఆర్‌ సహకారం చేసింది. విశ్వవేదికపై మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్స్ అందుకున్నారు. ఆస్కార్ అవార్డ్ అందుకుంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి పాట పాడారు. ఇక ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ రావ‌డంతో భార‌తీయ సినీ ప్రియులు సంబ‌రాల్లో మునిగిపోయారు.

కాగా, ఈ ఏడాది ఆస్కార్ బరిలో ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఐదు పాటలు పోటీ పడ్డాయి. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ‘నాటు నాటు’ పాటతో పాటుగా బ్లాక్‌ పాంథర్‌ వకాండా చిత్రంలోని `లిఫ్ట్‌ మీ అప్‌`, టెల్‌ ఇట్‌ లైక్‌ ఏ ఉమెన్‌ సినిమాలోని `అప్లాజ్‌`, ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌ చిత్రంలోని `దిస్‌ ఈజ్‌ ఏ లైఫ్`, టాప్ గన్;మావ్ రిక్ సినిమా నుంచి `హోల్డ్‌ మై హ్యాండ్‌` సాంగ్స్ ఆస్కార్ కు నామినేట్ అయినట్లు జనవరి 24న అకాడమీ ప్రకటించింది. అయితే మిగిలిన నాలుగు పాటలను వెనక్కి నెట్టి ఆర్ఆర్ఆర్‌లోని ‘నాటు నాటు’ పాట అకాడమీ అవార్డు సొంతం చేసుకుంది.

Share post:

Latest