`రానా నాయుడు` ఆల్ టైమ్ రికార్డ్‌.. నెగ‌టివ్ టాకే ప్లస్ అయిందిగా!

ద‌గ్గుబాటి హీరోలు విక్ట‌రీ వెంక‌టేష్‌, రానా తొలిసారి క‌లిసి న‌టించిన వెబ్ సిరీస్ `రానా నాయుడు`. మార్చి 10న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్‌ విడుదలైంది. హాలీవుడ్ సిరీస్ “రేయ్ డోనోవన్”కు రీమేక్ గా రూపొందిన ఈ సిరీస్ కు సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమన్ ద‌ర్శ‌కులుగా వ్య‌వ‌హ‌రించారు. సుర్వీన్ చావ్లా, అభిషేక్ బెనర్జీ, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి, ఆదిత్య మీనన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

క్రైమ్‌, యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్ పై ఎంత‌టి వ్య‌తిరేక‌త వ‌చ్చిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ వెబ్ సిరీస్ మొత్తం అశ్లీలత, అసభ్యత, మితిమీరిన శృంగారం, బూతులు లాంటి అంశాలే ఉండ‌టంతో సగటు ప్రేక్షకుడు, సినీ క్రిటిక్స్ దారుణంగా విమర్శిస్తున్నారు. అయితే ఆ నెగ‌టివ్ టాకే ఈ సిరీస్‌కు బాగా ప్ల‌స్ అయింది.

 

నెగటివ్ పబ్లిసిటీ వ‌ల్ల అస‌లు ఏముంది ఈ సిరీస్ లో అన్న క్యూరియాసిటీ ఏర్ప‌డి అందరూ నెట్ ఫ్లిక్స్ ఓపెన్ చేసి రానా నాయుడును చూశారు. దాంతో ఈ సిరీస్ ఆల్ టైమ్ రికార్డ్ ను క్రియేట్ చేసింది. తెలుగు ప్రేక్షకులు పెదవి విరిచిన రానా నాయుడు ఓటీటీలో రికార్డు వ్యూస్ మ‌రియు వాచ్ మినిట్స్ ని దక్కించుకుని నెట్ ఫ్లిక్స్ లోనే టాప్ 1 స్థానం లో ట్రెండ్ అవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సిరీస్ కు 8 మిలియన్లకుపైగా వ్యూస్, 200 మిలియన్ల వాచ్ మినిట్స్ వచ్చాయట. రీసెంట్ గా విడుదలైన అన్నీ వెబ్ సిరీస్ లలో ఇది ఆల్ టైం రికార్డు గా నిలిచింద‌ని అంటున్నారు.

Share post:

Latest