హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న రాజమౌళి.. క్లారిటీ ఇచ్చిన చెర్రీ..!

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో డైరెక్టర్ రాజమౌళి మాత్రమే కాదు ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా గ్లోబల్ స్టార్స్ అయిపోయారు. గత ఏడాది విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించడమే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనాన్ని సృష్టించింది. ఈ సినిమా విడుదలయ్యి దాదాపుగా ఏడాది పూర్తి కావస్తున్నా కూడా సినిమా మేనియా ఇంకా తగ్గడం లేదు. తరచూ ఈ సినిమా కి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ.. అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటుంది. ఇకపోతే ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం గత కొద్ది రోజులుగా అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో విహరిస్తున్న విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అక్కడే ఉంటున్న చిత్ర బృందం అక్కడి మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

4 years ago, this pic featuring Ram Charan, Rajamouli, Jr NTR sent fans  into a tizzy - Telangana Today

దీంతో గత వారం రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో మారుమ్రోగుతున్నాయి. ఇప్పటికే అక్కడ ఇంటర్వ్యూలలో రామ్ చరణ్, ఎన్టీఆర్ , రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్న నేపథ్యంలో రామ్ చరణ్ మరొక ఇంటర్వ్యూలో.. రాజమౌళి హాలీవుడ్ ఎంట్రీ విషయంపై క్లారిటీ ఇవ్వడం ఇప్పుడు మరింత ఆసక్తిగా మారింది.రామ్ చరణ్ మాట్లాడుతూ..” రాజమౌళి మార్వెల్ మూవీస్ కి డైరెక్షన్ వహించాలని ఆశిస్తున్నారు.. ఒకవేళ అదే జరిగితే అందరికీ పార్టీ ఇస్తాను.. నేను వాళ్ల ప్రతి సినిమాలోనూ ఉండాలని అనుకుంటున్నాను.

ప్రస్తుతం సినిమా రంగానికి ఎటువంటి హద్దులు లేవు.. హాలీవుడ్, బాలీవుడ్ అనే భేదాలు కూడా లేవు. అలాంటి ఓ రంగంలో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. ఒకవేళ మార్వెల్ చిత్రాలకు దర్శకత్వం వహించే అవకాశం వస్తే రాజమౌళి హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని క్లారిటీ ఇచ్చేశారు రాంచరణ్.

Share post:

Latest