యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఇటీవల ఓ ఇంటి వాడు అయిన సంగతి తెలిసిందే. సమంతతో విడిపోయిన తర్వాత కొద్ది రోజులు తండ్రి నాగార్జున ఇంట్లోనే ఉన్న నాగచైతన్య.. ఆ తర్వాత హోటల్ కు షిఫ్ట్ అయ్యాడు. అయితే గత వారం ఈయన తన కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశాడు.
నాగార్జున ఇంటికి దగ్గరలోనే ఓ స్థలం కొన్న చైతు.. తన అభిరుచికి తగ్గట్లుగా ఆ స్థలంలో కొత్త ఇల్లును నిర్మించుకున్నాడు. అన్ని సౌకర్యాలతో అత్యంత లగ్జరీగా, స్టైలిష్‌గా డిజైన్ చేయించుకున్నాడు. ఇంటి పనులన్నీ ఇటీవలె పూర్తి కావడంతో.. ఎలాంటి హడావిడి, ఆర్భాటం లేకుండా గృహప్రవేశం చేశాడు.
అయితే కొత్త ఇంటి కోసం చైతు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో తెలిస్తే షాకైపోతారు. ఎందుకంటే తన డ్రీమ్ హౌస్‌ను నిర్మించుకునేందుకు ఆయన ఏకంగా రూ. 15 కోట్లు ఖర్చు చేశాడట. అత్యంత విలాసంగా మరియు సుందరగా ఈ ఇల్లు ఉంటుందని తెలుస్తోంది. కాగా, సినిమాల విషయానికి వస్తే.. నాగచైతన్య ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్వకత్వంలో `కస్టడీ` అనే సినిమా చేస్తున్నాడు. కృతి శెట్టి ఇందులో హీరోయిన్. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.