రామ్ చ‌ర‌ణ్‌కు లైన్ క్లియ‌ర్ చేసిన ప్ర‌భాస్‌.. ఇది మోసం అంటున్న డార్లింగ్ ఫ్యాన్స్‌!?

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్ కే` ఒకటి. నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో హై బడ్జెట్ తో పాన్‌ వరల్డ్ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అమితాబ్ బచ్చన్, దిశా పటాని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుపుతోంది.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుక జ‌న‌వ‌రి 12న‌ ఈ సినిమాను విడుదల చేయాలని మేక‌ర్స్ భావించారు. కానీ ఇంతలోనే కీలక రోల్ చేస్తున్న అమితాబ్ కి ప్రమాదం జరిగింది. ఆయన గాయాల నుండి కోలుకునేందుకు టైమ్ పట్టేలా ఉంది. దీంతో ప్రాజెక్ట్ కే షూట్ డిలే కానుందట. చేసేది లేక సంక్రాంతి నుండి సమ్మర్ కి ప్రాజెక్ట్ కేను షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట.

ఇదే జ‌రిగితే ప్ర‌భాస్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కు లైన్ క్లియ‌ర్ చేసిన‌ట్లే అవుతుంది. ఎందుకంటే, రామ్ చ‌ర‌ణ్ చేస్తున్న `ఆర్సీ 15`ను 2024 సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు. సంక్రాంతి రేసు నుంచి ప్ర‌భాస్ త‌ప్పుకుంటే రామ్ చ‌ర‌ణ్ రావ‌డం క‌న్ఫార్మ్ అయిపోతుంది. అయితే మ‌రోవైపు ప్రాజెక్ట్ కే విడుద‌ల వాయిదా ప‌ట్ల డార్లింగ్ ఫ్యాన్స్ లోబోదిబోమంటున్నారు. 2022 సంక్రాంతికి రాధేశ్యామ్ అన్నారు.. రాలేదు. 2023 సంక్రాంతికి ఆదిపురుష్ అన్నారు.. కానీ, ఏకంగా ఆరు నెల‌లు వాయిదా వేశారు. ఇక ఇప్పుడు `ప్రాజెక్ట్ కె` సైతం పోస్ట్ పోన్ కానుంద‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో.. ఇది మోసం అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు అభిమానులు.

Share post:

Latest