పూజా హెగ్డే ధ‌రించిన ఆ స్టైలిష్ లెహంగా ధ‌ర తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేకు గత ఏడాది షాకుల మీద షాకులు తగిలిన సంగతి తెలిసిందే. వరుస ప్లాపుల్లో కోరుకుపోయిన పూజా హెగ్డే.. ఈ ఏడాది ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాల‌ని ఆశపడుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కి జోడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో `SSMB 28` అనే సినిమా చేస్తోంది. ఇందులో శ్రీ‌లీల మ‌రో హీరోయిన్ గా న‌టిస్తోంది.

శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం.. మ‌రికొన్ని నెలల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అలాగే బాలీవుడ్ లో రెండు ప్రాజెక్టులకు సైన్ చేసింది. ఈ సంగతి పక్కన పెడితే రీసెంట్గా పూజా హెగ్డే ఓ స్టైలిష్ లెహంగాలో మ‌రింత స్టైలిష్ గా ద‌ర్శ‌న‌మిచ్చి అంద‌రినీ ఎట్రాక్ట్ చేసింది. స్పెషల్‌గా డిజైన్ చేసిన ఈ బుర్గుండి సీక్విన్ లెహెంగా థ‌ర తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు.

ఎందుకంటే, పూజా ధ‌రించిన లెహంగా కాస్త్ అక్ష‌రాల 1,88,000. ఈ విష‌యం తెలిసి ఒక్క లెహంగా అంత రేటా? అని షాక్ అవుతున్నారు నెటిజన్లు. ఒక్కో సినిమాకు రూ. 4 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ తీసుకునే పూజా హెగ్డే.. ఆ మాత్రం కాస్ట్లీ దూస్తుల‌ను వేసుకోవాల్సిందే అంటున్నారు మ‌రికొంద‌రు.

Share post:

Latest