పెద్దాపురం-రామచంద్రాపురం వైసీపీ అభ్యర్ధులు ఫిక్స్..గెలుపు డౌట్?

ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో..ఏపీలో ప్రధాన పార్టీలు తమ అభ్యర్ధులని ఫిక్స్ చేసే పనిలో ఉన్నాయి. గతంలో మాదిరిగా ఎన్నికల సమయం ముందు అభ్యర్ధులని ఫిక్స్ చేయకుండా..ఇప్పటినుంచే అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వస్తున్నారు. అటు టి‌డి‌పి, ఇటు వైసీపీ అదే పనిచేస్తూ వస్తుంది. ఇప్పటికే టి‌డి‌పి అధినేత చంద్రబాబు పలు సీట్లు ఫిక్స్ చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న లోకేశ్..అక్కడ కూడా అభ్యర్ధులని ప్రకటిస్తూ వస్తున్నారు.

ఇటు జగన్ సైతం కొన్ని స్థానాల్లో అభ్యర్ధులని ఖరారు చేసేస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిశీలకుడుగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి..తాజాగా పెద్దాపురం, రామచంద్రాపురంల్లో పోటీ చేసే అభ్యర్ధుల పేర్లని ఖరారు. చేశారు. రామచంద్రాపురంలో మళ్ళీ వైసీపీ నుంచి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ పోటీ చేస్తారని ప్రకటించారు. ఇటు పెద్దాపురంలో ఇంచర్ దవులూరి దొరబాబు పోటీ చేస్తారని చెప్పుకొచ్చారు. అయితే ఈ రెండు సీట్లలో అభ్యర్ధులని ఫిక్స్ చేసేశారు.

అయితే వీరికి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయంటే..పెద్దాపురంలో వైసీపీ గెలవడం కష్టమని తాజాగా ఆత్మసాక్షి సర్వేలో తేలింది. అక్కడ టి‌డి‌పికే గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిసింది. గత ఎన్నికల్లో కూడా ఇక్కడ వైసీపీ గెలవలేదు. టి‌డి‌పి నుంచి రాజప్ప గెలిచారు. ఈ సారి కూడా అక్కడ ఆయనే పోటీ చేస్తున్నారు.

అటు రామచంద్రాపురంలో మాత్రం మంత్రి చెల్లుబోయిన కాస్త పోటీ ఎదురుకుంటున్నారు. ఇక్కడ టి‌డి‌పి నుంచి సరైన అభ్యర్ధి లేరు. అందుకే వైసీపీకి అడ్వాంటేజ్ ఉంది. అదే సమయంలో జనసేన-టి‌డి‌పి గాని కలిస్తే రామచంద్రాపురంలో మంత్రి గెలవడం కష్టమే అని చెప్పవచ్చు. ఇక ఉమ్మడి తూర్పు గోదావరిలో వైసీపీ-టీడీపీల మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తోంది..జనసేన కూడా కొన్ని స్థానాల్లో ప్రభావం చూపనుంది.