ఇలియానా పై నిషేధంపై.. క్లారిటీ ఇదే..!!

టాలీవుడ్ లో గోవా బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ ఇలియానా.పోకిరి చిత్రంతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది.ముఖ్యంగా తన నాజు కైనా నడుముతో అందాలతో కుర్రకారులను తన వైపు తిప్పుకుంది ఒకప్పుడు యూత్లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది. టాలీవుడ్ లో కెరియర్ దూసుకుపోతున్న సమయంలో ఇలియానా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవ్వాలని ఎన్నో కలలు కంటూ ప్రయత్నించింది. బాలీవుడ్లో ఇలియానాకి కనీసం సరైన అవకాశం కూడా దక్కలేదు దీంతో ఇలియానా కెరియర్ పూర్తిగా మసకబారిపోయింది.

ఇలియానాకి ఎలాంటి అవకాశాలు లేవు ఆమె కంటే చాలా ముందుగా కెరియర్ ప్రారంభించిన శ్రీయ వంటి వారు కూడా వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. వివాహమైన కూడా ఈమె హీరోయిన్గా రాణిస్తున్నది కానీ ఇలియానా ఆల్మోస్ట్ ఫేడ్ అవుట్ హీరోయిన్గా పేరు సంపాదించింది. గత కొన్ని రోజులగా ఇలియానా సౌత్ లో నిర్మాతలు నిషేధం విధించారు అంటూ పలు వార్తలు వైరల్ గా మారాయి. దీనిపై సౌత్ నిర్మాత మండలి వారు స్పందించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇలియానా పై ఎలాంటి నిషేధం లేదని వారు తాజాగా క్లారిటీ ఇచ్చారు.

చివరిగా దళపతి విజయ్ నటించిన చిత్రంలో నటించిన ఈ సినిమా 2012లో విడుదల అయింది తెలుగులో రవితేజతో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో 2018లో నటించింది ఆ తర్వాత ఈమె ఇలాంటి సౌత్ సినిమాలు నటించలేదు. ఇక ఇలియానా పై నిషేధం ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి కానీ ఇందులో వాస్తవం లేదని నిర్మాతలు సైతం తెలియజేశారు. అయితే కొంతమంది మాత్రం ఇలియానా మధ్య సమస్య ఏర్పడిన మాట వాస్తవమే కానీ సినిమా షూటింగ్ కి ఆలస్యం రావడం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఆమె పైన ఫిర్యాదు చేశామని తాజాగా నిర్మాతలు తెలియజేశారు.

Share post:

Latest