`ధ‌మ్కీ` ఈవెంట్ లో ఎన్టీఆర్ ధ‌రించిన ఆ స్టైలిష్ హుడీ ధ‌రెంతో తెలిస్తే షాకే!

ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూవీ `ఆర్ఆర్ఆర్`తో గ్లోబల్ స్టార్‏గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రీసెంట్ గా `దాస్ కా ధ‌మ్కీ` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వ‌క్ సేన్‌, నివేదా జంట‌గా న‌టించిన చిత్ర‌మిది.రావు రమేశ్, పృథ్విరాజ్‌, హైపర్‌ ఆది కీలక పాత్రలు పోషిస్తున్నారు.

వన్మయీ క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. ఉగాది పండుగ కానుక‌గా మార్చి 22న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. అయితే శుక్ర‌వారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించ‌గా.. ఎన్టీఆర్ స్పెష‌ల్ గెస్ట్ గా విచ్చేసి సినిమాపై మ‌రింత హైప్ క్రియేట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ బ్లాక్ అండ్ వైట్ కాంబో హుడీని ధరించారు.

స్టైలిష్ గా ఉన్న హుడీ అభిమానులు బాగా ఎట్రాక్ట్ చేసింది. దాంతో దాని రేటు సెర్చ్ చేసి షాక‌య్యారు. ఓనిట్సుకా టైగర్ అనే వెబ్ సైట్ లో 170 యూరోస్ కి ఎన్టీఆర్ ధ‌రించి ఆ స్లైలిష్ హుడీ అందుబాటులో ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ. 15 వేల వరకూ ఉంటుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ఎన్టీఆర్ వాడే ప్ర‌తి వ‌స్తువు చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఫస్ట్ టైమ్ కాస్త తక్కువ రేటు ఉన్న షర్ట్ ను వేసుకున్నాడు ఎన్టీఆర్‌. అయితే ధ‌ర త‌క్కువ‌గా ఉన్నా.. ఎన్టీఆర్ ధ‌రించ‌డం వ‌ల్ల ఆ హుడీ విలువ ఎంతో పెరిగింద‌ని అంటున్నారు అభిమానులు.

Share post:

Latest