ఎన్టీఆర్ అరుదైన ఘ‌న‌త‌.. ఆఖ‌రికి హాలీవుడ్ హీరోల‌ను కూడా తొక్కేశాడు!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బెస్ట్ ఓరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కు నామినేట్ అయిన నాటు నాటు పాట ఫైన‌ల్ గా అవార్డును అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఆస్కార్ వేడుక‌ల కోసం కాస్త ముందుగానే ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లాడు. అక్క‌డ‌ `ఆర్ఆర్ఆర్‌`ను గ‌ట్టిగా ప్ర‌మోట్ చేస్తూ అమెరికాలో అందరిని ఆకర్షించాడు.

గ్లోబ‌ర్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుని హాలీవుడ్ స్టార్స్, డైరెక్టర్స్ త‌న గురించి మాట్లాడుకునేలా చేశాడు. డ్రస్సింగ్ స్టైల్ తోనూ ఆక‌ట్టుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ఓ అరుదైన రికార్డును నెల‌కొల్పాడు. నెట్ బేస్ క్విడ్ అనే డేటా విశ్లేషణ సంస్థ రిలీజ్ చేసిన సర్వే వివరాల ప్రకారం.. ఆస్కార్ వేడుక జరుగుతున్న స‌మ‌యంలో సోషల్ మీడియాతో పాటు న్యూస్ మీడియాలో అందరికంటే ఎక్కువగా మెన్షన్ చేసిన నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ మొద‌టి స్థానంలో నిలిచి అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు.

దాదాపు 1.05 మిలియన్ల మంది ఎన్టీఆర్ సోషల్ మీడియా పేజ్ @tarak9999 ని మెన్షన్ చేశార‌ట‌. అలాగే రెండో స్థానంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిలిచాడు. ఆ తరువాత స్థాన్నాల్లో ఎవ్రీథింగ్ నటుడు కె హ్యూయ్ ఖాన్, ఉత్తమ నటుడు బ్రెండన్ ఫ్రేజర్, అమెరికన్ యాక్టర్ పెడ్రో పాస్కల్ ఉన్నారు. ఏదేమైనా హాలీవుడ్ హీరోల‌ను కూడా తొక్కేసి ఎన్టీఆర్ ఫ‌స్ట్ ప్లేస్ లో నిల‌వ‌డంలో అభిమానులు ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

Share post:

Latest