అది ఎన్టీఆర్ అంటే.. ఇలాంటి అరుదైన ఘ‌న‌త మ‌రే హీరోకు ద‌క్క‌లేదుగా!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` ప్రపంచ సినీప‌రిశ్ర‌మ‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును అందుకున్న సంగ‌తి తెలిసిందే. బెస్ట్ ఓరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కు నామినేట్ అయిన `నాటు నాటు` పాట ఫైన‌ల్ గా అవార్డును అందుకుంది చ‌రిత్ర సృష్టించింది.

ఇక‌పోతే ఆస్కార్ అవార్డుల వేడుక కోసం ఎన్టీఆర్ కాస్త ముందుగానే ఆమెరికా వెళ్లి అక్క‌డ సంద‌డి చేశాడు. `ఆర్ఆర్ఆర్‌`ను గ‌ట్టిగా ప్ర‌మోట్ చేస్తూ అమెరికాలో అందరిని ఆకర్షించాడు. అయితే ఈ సినిమాతో గ్లోబ‌ర్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ కు ఓ అరుదైన ఘ‌న‌త ద‌క్కింది. ఆస్కార్ అఫీషియల్ హ్యాండిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్టీఆర్ ను ఫాలో అవ్వ‌డం ప్రారంభించారు.

ఆస్కార్ అఫీషియల్ హ్యాండిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇండియాకి సంబంధించిన ఇద్దరి హీరోలను మాత్రమే ఫాలో అవుతుంది. అందులో ఒక‌రు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కాగా.. ఇప్పుడు ఎన్టీఆర్ ఈ జాబితాలో చేరాడు. ఎన్టీఆర్ త‌ప్పా ఇటువంటి అరుదైన ఘ‌న‌త నార్త్ లో మ‌రే హీరోకు ద‌క్క‌లేదు. దీంతో అది మా ఎన్టీఆర్ అంటే.. అని అభిమానులు తెగ మురిసిపోతున్నారు.

Share post:

Latest