మ‌రో జ‌న్మంటూ ఉంటే అలానే పుట్టాల‌నుంది.. ఎన్టీఆర్ ఎమోష‌న‌ల్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తాజాగా అమెరికా వెళ్లిన సంగ‌తి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్` సినిమాలోని `నాటు నాటు` పాట ఆస్కార్ కు నామినేట్ అవ్వ‌డంతో.. ప్ర‌స్తుతం రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌తో పాటు చిత్ర టీమ్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో మునిగిపోయారు. 95వ అకాడ‌మీ అవార్డుల కార్య‌క్ర‌మం మార్చి 12న లాస్ ఏంజిల్స్‌లో వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. ఇక‌పోతే యూఎస్‌లో తారక్‌కు ఘన స్వాగతం పలికిన అభిమానులు.

 

ఈ సంద‌ర్భంగా ఫ్యాన్స్ తో ఇంట్రాక్ట్ అవుతూ ఎన్టీఆర్ ఎమోష‌న‌ల్ కామెంట్స్ చేశారు. `మీరు చూపిస్తున్న అభిమానానికి నేను ఎప్పుడు రుణ‌ప‌డి ఉంటాయి. మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి వంద రెట్లు అభిమానం నా గుండెల్లో ఉంది. కానీ, అది నేను చూపించ‌లేక‌పోతున్నాను. మ‌న మ‌ధ్య ఏ ర‌క్త సంబంధం లేక‌పోయినా.. అంతకంటే గొప్ప బంధం మ‌న‌ది. మీరంద‌రూ నా సోద‌రుల కంటే ఎక్కువ.

శిర‌స్సు వంచి పాదాభివందనం చేస్తున్నాన‌నే మాట‌ను చెప్ప‌గ‌ల‌ను. మీ ప్రేమ‌కు నేను రుణ ప‌డిపోయాను. ఇంకో జ‌న్మంటూ ఉంటే ఈ అభిమానం కోస‌మే పుట్టాల‌ని కోరుకుంటున్నాను` అంటూ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్య‌లు అభిమానుల‌ను ఎంత‌గానో ట‌చ్ చేశాడు. కాగా, ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కాలిఫోర్నియా లోని బేవర్లీహిల్స్ లో ఉన్నాడు. తన హోటల్ రూమ్ నుంచి తారక్ షేర్ చేసిన స్కై వ్యూ పిక్ ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.

Share post:

Latest