పర్సనల్ లైఫ్‌లో వద్దు.. కానీ వర్క్ లైఫ్‌లో ముద్దు.. సమంత రూటే సపరేటు!

సమంతా రూత్ ప్రభు తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ బాగా పాపులర్ అయింది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో ఈ ముద్దుగుమ్మ బోల్డ్ సన్నివేశాల్లో కూడా నటించి ఆశ్చర్యపరిచింది. అయితే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే విడాకులు, అనారోగ్య సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి. సమంత పర్సనల్ లైఫ్‌లో భార్యగా అసలు ఉండలేకపోయింది కానీ సినిమాల్లో పవిత్రమైన మంగళసూత్రం ధరించి భార్య పాత్రలో నటించడం మాత్రం కొనసాగిస్తోంది.

ఇప్పటివరకు సమంత భార్యగా నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి సమంతకొకదానికే ఆ ట్రాక్ రికార్డు ఉంది. తెలుగులో మనం, మజిలీ, తమిళంలో తేరి, సూపర్ డీలక్స్ వంటి సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ భార్యగా నటించింది. అవన్నీ సమంత కెరీర్‌లో మరపురానివి. ఈ అందాల తార ప్రస్తుతం తెలుగులో శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి చిత్రంలో కనిపించనుంది. ఈ మూవీ సెకండాఫ్‌లో ఈ తార ఆమె హౌజ్ వైఫ్ గా నటిస్తుంది.

ఆమె నటన అద్భుతంగా ఉంటుందని, ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. మజిలీలో, సమంత వివాహిత మహిళగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగా ఆకట్టుకుంది. మరి ఖుషి సినిమాలో ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. సమంత పర్సనల్ లైఫ్ లో భార్యగా ఉండకపోయినా సినిమాల్లో మాత్రం భార్య పాత్రలను రిజెక్ట్ చేయడం లేదట. ఖుషి సినిమాలో సమంత కమర్షియల్ టచ్ లేకుండా నార్మల్ రోల్‌లో చేస్తుందట. ఓవరాల్‌గా సినిమాల్లో పెళ్లయిన క్యారెక్టర్స్ చేస్తున్న సమంత సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్‌ను ఖుషితో కొనసాగవచ్చు. మరి ఈ సినిమా నటికి వైఫ్ రోల్ మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందేమో కాలమే సమాధానం చెప్పాలి.

Share post:

Latest