నోటి దూల అంటే ఇదే.. నాని మ‌ళ్లీ అడ్డంగా ఇరుక్కున్నాడు!

న్యాచుర‌ల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంట‌గా `ద‌స‌రా` అనే పాన్ ఇండియా చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త వ్య‌క్తి ఈ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన‌ ఈ సినిమా మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఇప్ప‌టికే ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ఊపందుకున్నాయి. నాని వ‌ర‌స‌గా ఇంట‌ర్వ్యూలో పాల్గొంటూ సినిమాపై మంచి హైప్ పెంచుతున్నారు. ఈ క్ర‌మంలోనే త‌న నోటి దూల‌తో వివాదాల్లోకి ఇరుక్కున్నాడు. రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో పుష్ప ముందు వ‌ర‌కు డైరెక్ట‌ర్ సుకుమార్ తెలుగు ప్రేక్షకులకు తప్పితే మిగతా భాషల వారికి తెలియ‌దు అంటూ త‌క్కువ చేసి మాట్లాడి వివాదంలో ఇరుక్కున్నాడు.

తాజాగా నాని త‌న తోటి హీరోల‌ను టార్గెట్ చేసి నోరు జారాడు.ఆయన ఉద్దేశం ఏమిటో తెలియదు కానీ నాని చెప్పిన సమాధానం మిగతా స్టార్స్ ని కించపరిచేదిగా ఉంది. అస‌లేం జ‌రిగిందంటే.. ఓ ఇంట‌ర్వ్యూలో లేడీ యాంకర్‌.. `దసరా చిత్రం కోసం పొడుగ్గా జుట్టు పెంచారు. మీది ఒరిజినల్ జుట్టేనా?` అని ప్ర‌శ్నించింది. `దానికి వంద శాతం ఒరిజినల్ అండి. ఇదే క్వశ్చన్ అందరు హీరోలను అడకండి` అంటూ నాని స‌మాధానం ఇచ్చాడు. అంటే మిగిల‌న హీరోల‌ది ఒరిజిన‌ల్ కాద‌ని నాని ఉద్దేశ‌మా అంటూ నెటిజ‌న్లు ఆయ‌న‌పై ఫైర్ అవుతున్నారు. వివిధ కారణాలతో జుట్టు పోయి విగ్గులను ఆశ్రయిస్తున్న హీరోలపై నాని కావాల‌నే సెటైర్ వేశాడ‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Share post:

Latest