హైదరాబాద్ లో ఇల్లు కొన్న మృణాల్.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకైపోతారు!?

బాలీవుడ్ సినిమాల ద్వారా పాపులర్ అయిన అందాల భామ మృణాల్ ఠాకూర్.. గత ఏడాది `సీతారామం` సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుని ఓవర్ నైట్ స్టార్ గుర్తింపు పొందింది. ప్ర‌స్తుతం సౌత్ లో మృణాల్ కు ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి. ఇప్పటికే న్యాచురల్ స్టార్ నాని కి జోడిగా ఓ సినిమాకు సైన్ చేసింది.

అలాగే కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మృణాల్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ బయటకు వచ్చింది. అది ఏమిటంటే హైదరాబాదులో ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటిని కొలుకోలు చేసిందట. తెలుగులో అవకాశాలు పెరిగిన నాయికలు ఇటీవల హైదరాబాద్‌లో ఇళ్లు కొనుక్కుంటున్నారు.

ఈ క్రమంలోనే మృణాల్‌ ఠాకూర్‌ కూడా హైదరాబాద్‌లో సొంత ఇల్లును కొనుగోలు చేసింద‌ట‌. అన్ని సౌక‌ర్యాల‌తో అత్యంత విలాసంగా ఉండే ఈ ఇంటి ధ‌ర తెలిస్తే షాకైపోతారు. ఎందుకంటే, మృణాల్ ఏకంగా రూ. 6 కోట్లు వెచ్చించి మ‌రీ హైద‌రబాద్ లో ఇంటిని కొనుగోలు చేసింద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం టాలీవుడ్ నుంచి ఎక్కువ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయట‌. అందుకే కొన్నాళ్లు ఇక్క‌డ స్థిర‌ప‌డాల‌ని మృణాల్ డిసైడ్ అయింద‌ని టాక్ న‌డుస్తోంది.

Share post:

Latest