చిరంజీవి వెబ్‌ సిరీస్ లో చేయాలనుకుంటున్నారా? ఎందుకీ స్టేట్మెంట్స్ మరి?

కరోనా తరువాత తెలుగు చిత్రసీమలో పెను మార్పులు సంభవించాయి అని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఒక్క విషయంలో చాలా మార్పు కనిపించింది. అదేమంటే… ఇపుడు సినిమా ప్రేక్షకుడు సినిమాలు చూసే దృష్టికోణం బాగా మారింది. నిజం చెప్పుకోవాలంటే నేడు థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుడు సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఓటిటిలకు మంచి గిరాకీ ఏర్పడింది. ఇదే పెను మార్పు అని చెప్పుకోవచ్చు. అందుకే ఇపుడు ఓటిటిలకు సంబంధించి చాలా ప్రత్యేకమైన సినిమా కంటెంట్ అనేది తయారు చేయబడుతుంది. దీనిని మనవాళ్ళు వెబ్ సిరీస్ అని పిలుస్తున్నారు.

ఇలాంటి వెబ్ సిరీస్ లలో చిన్న చిన్న హీరోలతో పాటు, పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా నటించడానికి మక్కువ చూపుతున్నారు. దానికి ఉదాహరణగా వెంకటేష్, రానా గురించి చెప్పుకోవాలి. ఈమధ్య వీరు నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ రిలీజై ఓటిటిలో దుమ్ము దులుపుతోంది. ఈ క్రమంలోనే మన మెగాస్టార్ చిరంజీవి గురించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అదేమంటే మెగాస్టార్ కూడా ప్రముఖ ఓటిటి ద్వారా ఒక అదిరిపోయే వెబ్ సిరీస్ లో నటించబోతున్నారని! ఇందులో నిజానిజాలు పరమేశుడికెరుకగాని, అభిమానులు మాత్రం మెగాస్టార్ ని ఓటిటిలో చూడడానికి సిద్ధంగా లేరు.

 

దానికొక కారణం వుంది. ఎందుకంటే, ఈమధ్య వెంకటేష్, రానా చేసిన రానా నాయుడు వెబ్ సిరీస్ పై భిన్న అభిప్రాయాలు వినబడుతునని. ముఖ్యంగా వారి అభిమానులే విమర్శలు చేయడం కనిపిస్తోంది. ఎందుకంటే దారుణమైన బోల్డ్ కంటెంట్ అందులో ఉంటుంది. కాబట్టి మెగాస్టార్ ఒకవేళ అలాంటి కంటెంట్ చేస్తే పరిస్థితి దారుణంగా ఉంటుంది అని మెగాభిమానులు దానికి వ్యతిరేకిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం మెగాస్టార్ కూడా వెబ్ సిరీస్ లో నటిస్తే చూసి తరించాలని చూస్తున్నారు. చూద్దాం మరి… ఎవరి కోరిక తీరుతుందో!

Share post:

Latest