అత్తారింటికి బయలుదేరిన కొత్త అల్లుడు మనోజ్.. వైర‌ల్‌గా నూత‌న జంట ఫోటోలు!

తాజాగా మంచు మ‌నోజ్ ఓ ఇంటి వాడు అయిన సంగ‌తి తెలిసిందే. దివంగత నేత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డితో మ‌నోజ్ ఏడ‌డుగులు వేశాడు. వీరిద్ద‌రికీ ఇది రెండో వివాహ‌మే కాగా.. హైద‌రాబాద్‌లోని మంచు ల‌క్ష్మి నివాసంలో మార్చి 3వ తేదీన‌ మ‌నోజ్‌-మౌనిక మూడు ముళ్ల బంధంతో ఒక‌ట‌య్యారు.

ఇరు కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితులు, స్నేహితుల‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా వీరి పెళ్లితో సంద‌డి చేశారు. పెళ్లి తర్వాత వధూవరులు అత్తారింటికి వెళ్లడం సాంప్రదాయం.

ఈ నేప‌థ్యంలోనే కొత్త అల్లుడు మ‌నోజ్ తన భార్య మౌనికతో కలసి కర్నూలు బయలుదేరారు. అది కూడా అలా ఇలా కాదు.. భారీ కాన్వాయ్ లో అత్తారింటికి వెళ్తున్నాడు.

రహదారిపై మంచు మనోజ్, మౌనిక కాన్వాయ్ దూసుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అలాగే వైట్ అండ్ వైట్ డ్రెస్ లో ఈ నూత‌న జంట అందంగా మెరిసిపోతున్నారు. మ‌నోజ్‌-మౌనిక తాజాగా ఫోటోలు నెటిజ‌న్ల‌ను తెగ ఆక‌ట్టుకుంటున్నాయి.

ఇక‌పోతే రాయలసీమలో అల్లుడికి అతిథి మర్యాదలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే మనోజ్ అత్తమామలు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఇద్దరూ లేరు. కాబట్టి కొత్త జంట అభిలప్రియ ఇంట్లో ఆతిథ్యం పొంద‌నున్నార‌ని స‌మాచారం.