మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ మూవీకి క్రేజీ టైటిల్ లాక్‌.. ఆ రోజే అనౌన్స్‌మెంట్‌!?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ప్రస్తుతం `ఎస్ఎస్ఎమ్ 28` వ‌ర్కింగ్ టైటిల్ తో సినిమా తెర‌కెక్కుతున్న‌ సంగతి తెలిసిందే. అతడు, ఖ‌లేజా చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న‌ హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల సెట్స్‌ మీదకు వెళ్ళిన ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఇంతవరకు ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేయలేదు. అయితే ఇప్పుడు ఆ తరణం రానే వచ్చేసింది. తాజాగా ఈ చిత్రానికి ఓ క్రేజీ టైటిల్ ను లాక్ చేశారట.

గ‌తంలో త్రివిక్ర‌మ్ కు ఉన్న `అ` సెంటిమెంట్ నేప‌థ్యంలో అర్జునుడు, అయోధ్య‌లో అర్జునుడు వంటి టైటిల్స్ ను ప‌రిశీలిస్తున్న‌ట్లు టాక్ న‌డిచింది. కానీ, ఇప్పుడు ఆ రెండు కాకుండా `ఆరంభం` అనే టైటిల్ ను ఫిక్స్ చేశార‌ట‌. ఉగాది పండుగ సంద‌ర్భంగా మార్చి 22న అఫీషియ‌ల్ గా టైటిల్ ను అనౌన్స్ చేయ‌నున్నార‌ని టాక్ న‌డుస్తోంది.

Share post:

Latest