ఉదయ్ కిరణ్ భార్య ఎలాంటి స్థితిలో ఉందో తెలిస్తే కన్నీరాగదు..!

‘చిత్రం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు ఉదయ్ కిరణ్. తన మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు ఉదయ్ కిరణ్. ఆ తరువాత కూడా నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. తన సినిమాలతో అమ్మాయిల కలల రాజుగా పేరు తెచ్చుకున్నాడు. అంత మంచి క్రేజ్ సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ కొంత కాలానికి అవకాశాలు రావడం లేదని డిప్రెషన్ లోకి వెళ్లి ఉరి వేసుకొని చనిపోయిన సంగతి మనందరికి తెలిసిందే.

అయితే ఈ విషయం గురించి అప్పట్లో చాలా పుకార్లు పుట్టుకొచ్చాయి. ఆపు కార్లు ఇప్పుడు అప్రస్తుతం. ఇకపోతే ప్రస్తుతం ఉదయ్ కిరణ్ భార్య విషిత గురించి ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఉదయ్ కిరణ్, విషిత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు విషిత ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేసేది. ఉదయ్ కిరణ్ ని పెళ్లి చేసుకున్న తరువాత ఆమె జాబ్ మానేసి ఇంట్లోనే ఉండేది. ఉదయ్ కిరణ్ చనిపోయిన తరువాత అతని మర్చిపోలేక చాలా కాలం ఆమె ఇంట్లోనే ఉండేది. కొంత కాలానికి ఆ బాధ నుండి కోలుకొని మళ్ళీ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ మొదలు చేయడం మొదలు పెట్టింది.

ఉదయ్ కిరణ్ ని బ్రతికించుకోడానికి ఆమె చాలా ప్రయత్నాలు కూడా చేసిందట. అతనికి కౌన్సిలింగ్ కూడా ఇప్పించిందట. కానీ ఆమె ఇంట్లో లేని సమయంలో ఉదయ్ కిరణ్ ఉరి వేసుకొని చనిపోయాడు. అతను చనిపోయి ఇంతకాలం అయినప్పటికీ విషిత మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఉదయ్ కిరణ్ జ్ఞాపకాలతోనే బ్రతుకుతుంది. ఆ జ్ఞాపకాలతోనే పనిలో విరామం దొరికినప్పుడు వృద్ధాశ్రమాలకు, అనాధాశ్రమాలకు విరాళాలు ఇస్తున్నారట. అలా ఇప్పటికీ ఉదయ్ కిరణ్ నే ఆమె గుర్తు చేసుకుంటూ బతుకుతున్నారట. దీని గురించి తెలిసి ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ బాగా ఎమోషనల్ అవుతున్నారు.

Share post:

Latest