బింబిసార వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి రీసెంట్ గా వచ్చిన చిత్రం `అమిగోస్`. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాతో రాజేంద్రరెడ్డి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అలాగే ఈ మూవీలో కన్నడ భామ ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది.
కెరీర్ లోనే తొలిసారి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన చిత్రమిది. ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. అంచనాలను అందుకోలేకపోయింది. కథ, కథనం ఎలా ఉన్నా కళ్యాణ్ రామ్ కష్టాన్ని మెచ్చుకోవచ్చు. త్రిపాత్రాభినయంలో చక్కని వైవిధ్యం కూడా చూపించాడు. కానీ, టాక్ అనుకూలంగా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
తాజాగా అమిగోస్ ఫైనల్ లెక్క బయటకు వచ్చింది. రూ. 15.50 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి నైజాం ఏరియాలో 1.54 కోట్లు, సీడెడ్ లో 98 లక్షలు మిగిలిన ప్రాంతాలు కలుపుకొని తెలుగు రాష్ట్రాలలో 5.22 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 35 లక్షలు, ఓవర్సీస్ లో 74 లక్షలు రాబట్టింది. ఈ లెక్కన మొత్తం కలెక్షన్ చూసుకుంటే 6.31 కోట్లు మాత్రమే వసూల్ చేయగలిగింది. దీంతో అమిగోస్ రూ. 9 కోట్లకు పైగా లాస్ ను మిగిల్చింది. మొత్తానికి లాంగ్ రన్ లో ఈ మూవీ డబుల్ డిజాస్టర్ గా మిగిలింది.