ఎవ‌డ్రా బేబ‌మ్మ ప‌నైపోయింద‌న్న‌ది.. ఆమె లైన‌ప్ చూస్తే షాకే!

`ఉప్పెన` సినిమాతో బేబ‌మ్మగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ కృతి శెట్టి తొలి సినిమాతోనే సెన్షేన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత కృతి శెట్టి నటించిన శ్యామ్ సింగ‌రాయ్‌, బంగార్రాజు చిత్రాలు కూడా మంచి విజయం సాధించాయి. కానీ ఆ తర్వాతే కృతి శెట్టికి బ్యాడ్ టైమ్ మొద‌లైంది. ఆమె నటించిన మూడు సినిమాలు గ‌త‌ ఏడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పట్టాయి.

దీంతో కృతి ప‌నైపోయిందంటూ ప్రచారం మొదలైంది. ఆఫర్లు కూడా రావడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. కానీ నిజానికి ఆమె లైన‌ప్‌ చూస్తే షాక్ అయిపోతారు. వరస ఫ్లాపులు పడినప్పటికీ కృతి శెట్టి మాత్రం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో ఈ అమ్మడు నాగచైతన్యకు జోడిగా `కస్టడీ` అనే సినిమాలో నటిస్తోంది. వెంక‌ట్ ప్ర‌భూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల కానుంది.

అలాగే కోలీవుడ్ లో స్టార్ హీరో సూర్యతో ఓ పాన్ ఇండియా సినిమాకు కమిట్ అయింది. ఇవి రెండూ కాకుండా మలయాళంలో ట్వినో థామస్ హీరోగా తెర‌కెక్కుతున్న `అజయంతే రందం మోషణం` మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా ఖరారు అయ్యింది. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీతో మలయాళంలోకి అడుగుపెడుతుంది. ఇక మ‌రోవైపు కృతి శెట్టి బాలీవుడ్ లో కొన్ని క‌థ‌లు వింటున్న‌ట్లు స‌మాచారం.

Share post:

Latest