శ్రీదేవి కూతురికి లైఫ్ ఇస్తున్న కొరటాల శివ.. కాళ్ల మీద పడినా తక్కువే జాన్వీ..!

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం జాన్వీ ధడక్ సినిమాలో నటించి వెండి తెరకు పరిచయమయ్యింది. ఈ సినిమాని మరాఠీ బ్లాక్‌బస్టర్ ‘సైరత్’ కి రీమేక్‌గా బాలీవుడ్ లో ‘ధడక్’ అనే పేరుతో గ్రాండ్ గా లాంచ్ అయింది. సినిమా డీసెంట్ హిట్‌గా నిలిచింది. ఆమె తన ప్రతి సినిమాతో నటనలోని మెలుకువలను నేర్చుకుంటుంది. కానీ ఇప్పటివరకు మంచి నటిగా ఈ ముద్దుగుమ్మ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఆమె ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ స్మాల్-బడ్జెట్ సినిమాలకే పరిమితమైంది. ఇప్పుడు కూడా ఈ తార దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో ‘బవాల్’ అనే చిన్న మూవీ చేస్తోంది.

ఇక తెలుగులో కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీని తీసుకున్నట్లు ఇటీవలే ప్రకటించారు. జాన్వీ కెరీర్‌లో ఇదే అతిపెద్ద ప్రాజెక్ట్. ఈ సినిమాలో నటించడానికి ఆమె కోట్ల రుపాయల పారితోషికం తీసుకుంటుందట. కొరటాల శివ దర్శకత్వం వహించే సినిమాల్లో ఎక్కువగా హీరోయిన్లకు మంచి పాత్రలు ఉంటాయి. ఉదాహరణకు మిర్చిలో అనుష్క, శ్రీమంతుడులో శృతి హాసన్. కియారా అద్వానీ కూడా భరత్ అనే నేనులో చిన్న పాత్రలో నటించింది. కొరటాల శివ ఎప్పుడూ హీరోయిన్ పాత్రను కేవలం పాటలకే పరిమితం చేయకుండా కథాపరంగా కూడా దోహదపడేలా చూసుకుంటాడు.

అయితే జాన్వీ కపూర్ మాత్రం తన యాక్టింగ్ కంటే ఎక్కువగా హాట్ అండ్ గ్లామరస్ ఫోటోషూట్‌లకే ఫేమస్ అయింది. అయితే ఆమె నటించే ప్రతి సినిమాతో తన నటనను మెరుగుపరుచుకుంటుంది. కానీ ఇప్పటికీ, ఆమె గ్లామ్ డాల్ అని ప్రేక్షకుల అభిప్రాయం. మరి కొరటాల శివ జాన్వీకి సంబంధించిన గ్లామ్ ఫ్యాక్టర్‌పై మాత్రమే దృష్టి పెడతాడా లేదా ఎన్టీఆర్ 30లో కథను ముందుకు తీసుకెళ్లి గణనీయమైన ప్రభావాన్ని చూపే పాత్రను ఆమెకు ఆఫర్ చేస్తాడా అనేది వేచి చూడాలి. అయితే ఈ సినిమాతో యంగ్ యాక్ట్రెస్ ఫేట్ మారిపోతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Latest