చీర‌లో చుర‌క‌త్తిలాంటి చూపుల‌తో పిచ్చెక్కించిన కీర్తి.. ఒక్క‌సారి చూస్తే దాసోహ‌మే!

ప్రముఖ స్టార్ హీరోయిన్, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ మరికొద్ది రోజుల్లో `దసరా` మూవీ తో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రంతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా ప‌రిచ‌యం కాబోతున్నాడు.

సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. గోదావరిఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. మార్చి 30న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది.

ప్ర‌స్తుతం ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో నానితో పాటు కీర్తి సురేష్ ఫుల్ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. కీర్తి సురేష్ తాజా ఫోటో షూట్ నెట్టింట వైర‌ల్ గా మారింది.

బ్లాక్ శారీలో చుర‌క‌త్తిలాంటి చూపుల‌తో పిచ్చెక్కించింది. కీర్తి సురేష్‌ లేటెస్ట్ ఫోటోలు సోష‌ల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తున్నాయి. ఒక్క‌సారి వాటిని చూస్తే కీర్తి సురేస్ కు దాసోహ‌మే అవుతారు.

అంత అందంగా క‌నిపిస్తూ కీర్తి సురేష్ ఆక‌ట్టుకుంటోంది. కీర్తి సురేష్ అందాల‌పై కుర్ర‌కారు క‌విత‌లు కూడా ఆల్తేస్తున్నారు. మ‌రి లేటెందుకు కీర్తి సురేష్ తాజా పిక్స్ పై మీరు ఓ లుక్కేసేయండి.

Share post:

Latest