పవన్‌ని రిస్క్‌లో పెట్టిన జోగయ్య..!

నెక్స్ట్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌కు సింగిల్ గా గెలిచిన్ సి‌ఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే ఏ మాత్రం లేవని కనీసం జనసేన పార్టీ సింగిల్ గా 10 సీట్లు గెలవడం కష్టమని తెలుస్తోంది. ఆ విషయం పవన్ కు సైతం అర్ధమైందనే చెప్పాలి. కాకపోతే జనసేన పార్టీ 50 సీట్లలో గెలుపోటములని మాత్రం శాసించే స్థాయిలో ఉంది. అంటే గెలవలేదు గాని..వైసీపీ-టీడీపీ గెలుపోటములని ప్రభావితం చేయగలదు.

టి‌డి‌పితో గాని పొత్తు పెట్టుకుంటే వైసీపీని గెలవనివ్వదు. పొత్తు లేకపోతే టి‌డి‌పిని గెలవనివ్వదు. అంటే జనసేన ప్రభావం ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే జనసేన..టి‌డి‌పితో పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లు గెలుచుకోవచ్చు..అలాగే టి‌డి‌పితో కలిసి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే తక్కువ సీట్లలో బలంగా ఉన్న పవన్‌కు టి‌డి‌పి సి‌ఎం సీటు వదులుకోవడం జరిగే పని కాదు..ఆ విషయం పవన్ కు తెలుసు. కానీ కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య మాత్రం…పొత్తు ఉంటే పవన్ కు సి‌ఎం సీటు ఇవ్వాలని టి‌డి‌పిని డిమాండ్ చేస్తున్నారు.

అలాగే చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి..పవన్ కు సీఎం సీటు ఇచ్చి..రాష్ట్రంలో టి‌డి‌పి-జనసేన ప్రభుత్వంలో లోకేష్‌ని భాగస్వామిని చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ జనసేనతో పొత్తు లేకపోతే టి‌డి‌పి ఓడిపోతుందని, ఓడిపోతే మళ్ళీ  ఆ పార్టీ దెబ్బతినడం ఖాయమని అన్నారు. అయితే జోగయ్య చేసే డిమాండ్లని టి‌డి‌పి ఏ మాత్రం ఒప్పుకోదు అనే సంగతి తెలిసిందే.

అవసరమైతే సింగిల్ గానే ముందుకెళ్లే ఛాన్స్ ఉంది. అప్పుడు టి‌డి‌పితో పాటు జనసేనకు నష్టమే. కొద్దో గొప్పో ఇంకా టి‌డి‌పి కష్టపడితే మ్యాజిక్ ఫిగర్ సీట్లు సాధించి అధికారానికి దగ్గర కావచ్చు. కానీ జనసేన పరిస్తితి అలా కాదు. ఆ పార్టీ 10 సీట్లలో గెలవడం కష్టమవుతుంది. అయితే పవన్ మాత్రం తమ గౌరవం తగ్గకుండా టి‌డి‌పితో పొత్తుకే రెడీ అవుతున్నారు.