అక్కినేని సుమంత్ విడాకులు తీసుకోవడానికి కారణం అదేనా..?

అక్కినేని కుటుంబం నుంచి హీరోగా వచ్చిన సుమంత్ అక్కినేని నాగేశ్వరరావు కూతురి కొడుకు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈయన ఇండస్ట్రీ లోకి వచ్చి చేసిన మొదటి సినిమా ప్రేమ కథ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమాని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. సుమంత్ ఆ తర్వాత చేసిన ఎన్నో సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఒక స్టేజిలో సుమంత్ కెరియర్ అయిపోయింది అనే వార్తలు వినిపించాయి. అయితే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వరుస సినిమాలు చేస్తూ వచ్చారు సుమంత్.

Why Sumanth Took Divorce?
సుమంత్ కెరియర్ లో మళ్ళీ రావా ,సుబ్రహ్మణ్యపురం అనే సినిమాలు హిట్టు పడినప్పటికీ ఆ తర్వాత మళ్లీ క్లాతులతో సతమతమయ్యారు. అందుకే హీరోగా సుమంత్ నిలవలేకపోయారని చెప్పవచ్చు అయితే సుమంత్ సినీ కెరియర్ లాగానే ఆయన పర్సనల్ లైఫ్ కూడా అంతగా సక్సెస్ ఫుల్ గా లేదని చెప్పవచ్చు. తొలిప్రేమ సినిమాతో హీరోయిన్గా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్న కీర్తి రెడ్డిని సుమంత్ ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. కానీ వీళ్ళ వైవాహిక జీవితం చాలా కాలం పాటు కొనసాగ లేక పోయింది.

ఎందుకంటే వీళ్ల పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి ఇద్దరి మధ్య పలు విషయాలలో పలు విభేదాలు రావడం వల్ల విడాకులు తీసుకోవడం జరిగిందట .ప్రస్తుతం సుమంత్ ఒక్కడే ఒంటరిగా జీవిస్తున్నారు. మళ్లీ ఇంకో వివాహం చేసుకోలేదు. కానీ కీర్తి రెడ్డి మాత్రం వివాహం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వారాహి అనే సినిమాలో నటిస్తున్నాడు సుమంత్. ఈసారి కచ్చితంగా సూపర్ హిట్ కొట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Share post:

Latest