151 సిట్టింగులకు మళ్ళీ సీట్లు..జగన్‌కు రిస్కే.!

దమ్ముంటే టీడీపీ-జనసేనలు ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేయాలని జగన్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే దిశగా ముందుకెళుతుండటంతో..రెండు పార్టీలు అన్నీ స్థానాల్లో పోటీ చేయడం కుదరదు. అందుకే జగన్ అన్నీ స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ చేశారు. ఇలా సవాల్ చేసి పరోక్షంగా టి‌డి‌పి-జనసేనలని రెచ్చగొట్టి..వారు పొత్తు లేకుండా పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయని, అప్పుడు తమకు లబ్ది చేకూరుతుందనే కాన్సెప్ట్ జగన్‌ది.

కానీ జగన్ ట్రాప్ వర్కౌట్ కాదనే చెప్పాలి..అయినా జగన్ చెప్పినట్లు తాము ఎందుకు చేయాలని రెండు పార్టీల శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఇదంతా పెద్ద ట్రాప్ అని అంటున్నారు. అదే సమయంలో జగన్ కు..టి‌డి‌పి శ్రేణుల నుంచి సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పలు సవాళ్ళు ఎదురు కాగా తాజాగా టి‌డి‌పి సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు ఓ సవాల్ విసిరారు. జగన్‌కు దమ్ముంటే 151 వైసీపీ ఎమ్మెల్యేలకు మళ్ళీ సీట్లు ఇవ్వగలరా? అని ప్రశ్నించారు. అలాగే ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇవ్వగలరా? అని..ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రాగలరా? అని చెప్పి సవాల్ విసిరారు.

అయితే ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ జగన్ మళ్ళీ సీట్లు ఇవ్వలేరనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారు..వారికి మళ్ళీ సీట్లు ఇస్తే వైసీపీ ఓడిపోవడం ఖాయమే. అందుకే జగన్ అందరికీ సీట్లు ఇచ్చే ధైర్యం చేయలేరనే చెప్పాలి. కొంతమందిని ఖచ్చితంగా జగన్ పక్కన పెట్టాల్సిన పరిస్తితి ఉంది. కాబట్టి టి‌డి‌పి-జనసేనలకు సవాల్ విసిరే ముందు వైసీపీ పరిస్తితి కూడా చూసుకోవాలని అంటున్నారు.