అన్ స్టాపబుల్ షో కి ఎండ్ కార్డు పడినట్టేనా..?

గడిచిన రెండు సంవత్సరాల క్రితం నుంచి బాలయ్యలో పెనుమార్పు రావడం మనం గమనించవచ్చు. ముఖ్యంగా అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే పలు రకాల యాడ్లకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే మంచి మంచి కథలను ఎంచుకుంటూ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నారు. ఇప్పటివరకు అన్ స్టాపబుల్ సీజన్ -2 సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంది.త్వరలోనే త్రి సీజన్ కూడా మొదలు కాబోతోందనే వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం బాలకృష్ణ అన్ స్టాఫబుల్ షోని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

BalaKrishna's 'Unstoppable' promo amplifies the hype - Telangana Today
సినిమాలతో బాలయ్య బిజీగా ఉండడం చేత ఆ తర్వాత పొలిటికల్ గా కూడా బిజీగా ఉండడం చేత అన్ స్టాపబుల్ షో కి డేట్స్ ఇచ్చే అంత టైం ఖాళీగా లేకపోవడంతో ఈ షో కి పుల్ స్టాప్ పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా గడిచిన కొద్ది రోజుల క్రితం తారకరత్న మరణంతో బాలకృష్ణ చాలా డిస్టర్బ్ అయినట్లుగా సమాచారం. దీంతో చేసే అవకాశం లేదని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరొకపక్క.. అన్ స్టాపబుల్ షో వల్ల బాలకృష్ణ కన్నా ఆహా వల్ల అల్లు అరవింద్ కు ఎక్కువ లాభపడుతున్నారు అందుకే కాంట్రాక్ట్ తిరిగి రాసేలా మాట్లాడాలని బాలకృష్ణ టీం అనుకుంటున్నట్లు సమాచారం.

అంతేకాకుండా అన్ స్టాపబుల్-3 ఉంటే ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తో పాటు వెంకటేష్ నాగార్జున రామ్ చరణ్ వంటి వారిని పిలుస్తారు అనుకున్నారు కానీ సీజన్ 3 లేకుండానే ఈ షోని ఆపేస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ సీజన్ 3 ని ప్లాన్ చేస్తే అది ఇప్పట్లో మాత్రం ఉండే అవకాశం లేదని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా అన్ స్టాపబుల్ షో కి ఎండ్ కార్డు పడినట్టే అంటే పలువురు నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest