వామ్మో.. పుష్ప 2 టీజ‌ర్ కోస‌మే అన్ని కోట్లు ఖ‌ర్చు పెడుతున్నారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన `పుష్ప ది రైజ్‌` ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లోనూ కాసుల వర్షం కురిపించింది. దీంతో రెండో భాగంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆ అంచనాలను అందుకునేందుకు సుకుమార్ పక్క ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నాడు.

స్క్రిప్ట్ లో ఎన్నో మార్పులు చేర్పులు చేసి మరీ షూటింగ్ ను ప్రారంభించాడు. ఇకపోతే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా మేకర్స్ పుష్ప 2 టీజ‌ర్ ను లాంఛ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నార‌ట‌. అయితే ఈ టీజ‌ర్ ను చాలా స్పెషల్ గా తీర్చిదిద్దబోతున్నారట. టీజర్ తోనే సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేయాలని సుకుమార్ డిసైడ్ అయ్యాడట.

ఇందులో భాగంగానే దాదాపు ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయిల‌ ఖర్చుతో టీజ‌ర్ ను ప్రత్యేకమైన షార్ట్స్ తో అదిరిపోయే విధంగా తీర్చిదిద్దుతున్నారని ఇన్‌సైడ్ టాక్ న‌డుస్తోంది. అంతేకాదు ఈ టీజర్ రిలీజ్ తర్వాత మొత్తం బిజినెస్ క్లోజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నార‌ట‌. అంటే పుష్ప 2 టీజ‌ర్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాగా, ఎర్ర చంద‌నం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే మలయాళ నటుడు ఫాహ‌ద్ ఫాజిల్ మెయిన్ విలన్ గా కనిపించనున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నాడు.

Share post:

Latest